కామన్వెల్త్ గేమ్స్ తెలంగాణ ముద్దుబిడ్డ, భారత బాక్సర్ నిఖత్ జరీన్ తో పాటు టేబుల్ టెన్నిస్ (టీటీ) మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ–ఆచంట శరత్ కమల్ (భారత్) స్వర్ణ పతాకాలు గెలుపొందారు. దీంతో కామన్వెల్త్ గేమ్స్ లో బాక్సింగ్ విభాగంలో ఆదివారం భారత్ సాధించిన గోల్డ్ మెడల్స్ సంఖ్య ఇందుకు పెరిగింది.మొత్తంగా భారత్ 18 స్వర్ణాలు, 53 పతాకాలు సాధించింది.
ఉత్తర ఐర్లాండ్ కు చెందిన కార్లీ ఎంసీ నౌల్ ను ఓడించి గోల్డ్ మెడల్ ను నిఖత్ తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఇవాళ ఒక్కరోజే భారత్ సాధించిన పతకాల సంఖ్య 6కు పెరిగింది. బాక్సర్లు అమిత్ పంఘాల్, నీతు ఘన్ ఘాస్ రెండు బంగారు పతకాలు సాధించగా, పురుషుల ట్రిపుల్ జంప్ విభాగంలో ఎల్డ్ హోస్ పాల్ స్వర్ణం సాధించాడు.
ట్రిపుల్ జంప్ లో అబ్దుల్లా అబూబకర్ కు రజతం, రేస్ వాక్ విభాగంలో సందీప్ కుమార్ కు కాంస్యం దక్కాయి. కామన్వెల్త్ గేమ్స్ లో ఇప్పటివరకు భారత్ మొత్తం 48 పతకాలను సాధించగా, వాటిలో 17 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి.
టేబుల్ టెన్నిస్ (టీటీ) మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ–ఆచంట శరత్ కమల్ (భారత్) జంట స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో శ్రీజ–శరత్ కమల్ ద్వయం 11–4, 9–11, 11–5, 11–6తో జావెన్ చూంగ్–లిన్ కరెన్ (మలేసియా) జోడీపై గెలిచింది. తద్వారా భారత్ ఖాతాలో 18వ స్వర్ణం, ఓవరాల్‌గా 53వ పతకం చేరాయి.
మరోవైపు పురుషుల డబుల్స్ ఫైనల్లో శరత్ కమల్–సత్యన్ జ్ఞానశేఖరన్ (భారత్) జంట 11–8, 8–11, 3–11, 11–7, 4–11తో పాల్ డ్రింక్‌హాల్–లియామ్ పిచ్‌ఫోర్డ్ (ఇంగ్లండ్) జోడీ చేతిలో ఓడిపోయి రజత పతకం సాధించింది. స్క్వాష్ ఈవెంట్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సౌరవ్ ఘోషాల్–దీపిక పల్లికల్ జంట భారత్‌కు కాంస్య పతకాన్ని అందించింది.
నిఖత్ జరీన్ స్వర్ణం గెలవడం పట్ల ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వీరిరువురు నిఖత్‌ను అభినందనలతో ముంచెత్తారు. నిఖత్.. భారత్‌కు గర్వకారణమని, భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ప్రధాని.. నిఖత్ గెలుపుతో తెలంగాణ కీర్తి విశ్వవ్యాప్తమైంది, నిఖత్.. తన విజయపరంపరను కొనసాగించాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
కామన్వెల్త్ లో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సైతం అదరగొడుతోంది. మహిళల సింగిల్స్ విభాగంలో సింధూ ఫైనల్ కి దూసుకెళ్లింది. సింగపూర్ షట్లర్ పై సింధు వరుస సెట్లు నెగ్గింది. జియామిన్ యో పై 21-19,21-17 తేడాతో ఘన విజయం సాధించింది.
పదునైన షాట్లతో ప్రత్యర్థిని సింధు ఉక్కిరి బిక్కిరి చేసింది. ఏ మాత్రం సింగపూర్ షట్లకు ఛాన్స్ ఇవ్వలేదు. గ్రౌండ్ నలువైపులా సింధు ఆడింది. ఫైనల్లో సింధు తలపడనుంది.