ముస్లింలు అనగానే బహుభార్యత్వం లేదా అనేక మంది మహిళలతో పురుషులు భౌతిక సంబంధాలు పెట్టుకుంటారని భావిస్తుంటాము. అయితే క్రమంగా దేశంలో పరిస్థితులు తారుమారు అవుతున్నట్లు కనిపిస్తున్నది. ఇతర మాతాళలోకన్నా హిందూ మతంలోని పురుషులలో బహు లైంగిక భాగస్వాములను కలిగి ఉండటం పెరుగుతున్నట్లు తేలుతున్నది.
హిందూ పురుషుల తర్వాత, సిక్కులు, క్రైస్తవులు, బౌద్దులు, ముస్లింలు, జైనులలో ఇటువంటి ధోరణులు ఎక్కువగా కనిపిస్తున్నాయని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5 (ఎన్ఎఫ్హెచ్ఎస్-5) సర్వే డేటాను ‘ది వైర్’ వెల్లడించింది. 2019-20లో కేంద్ర ప్రభుత్వం కోసం ముంబయికి చెందిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ స్టడీస్ ఈ సర్వేను నిర్వహించింది.
హిందూ పురుషులు పెళ్లి కాకుండా లివింగ్ ఇన్ రిలేషన్షిప్ లేదా అక్రమ సంబంధాలు కలిగి ఉండేందుకు ఇష్టపడుతున్నారు. వారి జీవిత కాలంలో సగటున 2.2 మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నారని తెలిపింది. సిక్కులు, క్రైస్తవులు 1.9, బౌద్ధులు, ముస్లింలు సగటు 1.7 మందితో లైంగిక సంబంధాలు కలిగి ఉంటున్నారు. జైనులు అత్యల్పంగా సగటున 1.1 మంది మాత్రమే.
పలువురు మహిళలతో శారీరక సంబంధాల వల్ల లైంగిక పరంగా సంక్రమించే వ్యాధులు, ఎయిడ్స్ వంటి రోగాలు వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని కూడా సర్వే పేర్కొంది. 29 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 8.25 లక్షల మందిని సంప్రదించగా.. 1.01 లక్షల మంది పురుషులు సర్వేలో పాల్గొన్నారు. \
కాగా, 2015-16 మధ్య కాలంలో ఎన్హెచ్ఎఫ్ఎస్-4 చేపట్టిన సర్వే ప్రకారం క్రైస్తవ పురుషులు సగటున 2.4 మందితో అత్యధిక లైంగిక భాగస్వాములు కలిగి ఉన్నారు. బౌద్ధులు, ముస్లింలు 2.1 మంది, హిందువులు 1.9 మంది భాగస్వాములున్నారు. ఈ లెక్క ప్రకారం.. గత సర్వే కన్నా ఇప్పటి సర్వేలో పోల్చి చూస్తే హిందూ మత వర్గంలోని పురుషులు… అనేక మందితో లైంగిక పరమైన రిలేషన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు.
ఎన్హెచ్ఎఫ్ఎస్-5 సర్వేకు ముందు సంవత్సరంలో ఎంత మంది పురుషులు తమ భార్య కాని వారితో భౌతికపరమైన సంబంధాలు పెట్టుకున్నారో కనుగొనేందుకు ప్రయత్నిస్తోంది. కాగా, ఈ సర్వేలో పాల్గొన్న బౌద్ధ పురుషుల్లో 7.8 శాతం మంది అక్రమ సంబంధాలపై అవుననే సమాధానమిచ్చారు.
తర్వాత సిక్కులు 6.0 శాతం, హిందువులు 4 శాతం, క్రైస్తవులు 3.8 శాతం, ముస్లింలు 2.6 శాతం మంది ఉన్నారు. మొత్తం మీద సర్వేకు ముందు 12 నెలల్లో భార్యతో కాకుండా ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు నెరిపిన పురుషులు 4 శాతం మంది ఉన్నట్లు తేలింది.
కాగా, ఈ సంబంధాల్లో కూడా ముఖ్యంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలను పరిశీలిస్తే.. ఎన్ఎఫ్హెచ్ఎస్-5 నిర్వహించడానికి 12 నెలల ముందు పలుమార్లు లైంగిక సంబంధాలు నెరిపిన ముస్లింలలో పురుషులు అత్యధికంగా కండోమ్లు వినియోగించారు. వీరిలో 64.1 శాతం మంది ముస్లిం పురుషులు ఉండగా.. ఆ తర్వాత స్థానాల్లో బౌద్ధులు 58.2 శాతం, క్రైస్తవులు 44.7 శాతం మంది ఉన్నారు.
సంపద స్థాయిలను బట్టి చూసిన బహుళ భాగస్వాముల భేదం పెద్దగా లేదు. ధనిక, రెండవ, మధ్య, పేదవాడు దగ్గర నుండి 2.0 శాతం-2.5 శాతం మంది పురుషులు తమ అభ్యాసంలో నిమగ్నమై ఉన్నారని తేలింది.
ఎస్టికి చెందిన పురుషుల్లో అత్యధికంగా 2.4 శాతం మంది ఉండగా. ఆ తర్వాత ఇతర వెనుకబడిన తరగతులు 2.2 శాతం, ఎస్సిలకు చెందిన వారిలో ఆ శాతం 2.1గా ఉంది. రాష్ట్రాల్లో మేఘాలయ అగ్రస్థానంలో ఉండగా… సిక్కిం, ఆంధ్రప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను ముస్లింలో అత్యధికంగా (1.9 శాతం) ఉండగా.. ది వైర్ విశ్లేషణ ప్రకారం .. హిందూ పురుషుల్లోనే గరిష్ట సంఖ్యలో లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నారు. హిందూ పురుషుల్లో బహుభార్యత్వం 1.3 శాతంగా ఉంది.
ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం భారత్లో ముస్లింలు చట్టబద్ధంగా ఒకటి కంటే ఎక్కువ మంది భార్యలు కలిగి ఉండవచ్చు. కానీ హిందూ, ఇతర మతస్థులకు ఇది వర్తించదు. కాగా, గత సర్వేతో పోలిస్తే.. ఈ సర్వేలో బహుభార్యత్వం కోల్పోయి, బహు లైంగిక ధోరణి పెరిగినట్లు కనిపిస్తోంది. చండీఘర్, ఢిల్లీ, పంజాబ్, రాజస్తాన్, జార్ఖండ్, మేఘాలయ, త్రిపుర, మహారాష్ట్ర, పుదుచ్చేరి మినహా దాదాపు ప్రతి రాష్ట్రంలో బహు భార్యత్వం రేటు తగ్గింది. మేఘాలయ 6.1 శాతం, మిజోరాం 4.1 శాతంతో బహుభార్యత్వ వివాహాలు అత్యధికంగా ఉన్నాయి.