75వ స్వాతంత్య్ర భారతదేశ వజ్రోత్సవాల వేళ భారత్కు అంతరిక్షం నుంచి శుభాకాంక్షల సందేశాన్ని వ్యోమగామి సమంత క్రిస్టోఫొరెట్టి పంపారు. అంతర్జాతీయ రోదసి కేంద్రంలో పని చేస్తున్న సమంత క్రిస్టోఫొరెట్టి ఓ వీడియో సందేశంలో భారత దేశానికి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.
75వ స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకుంటున్న సమయంలో భారతదేశాన్ని అభినందించడం హర్షణీయమని ఆమె పేర్కొన్నారు. అంతర్జాతీయ సంస్థలు చాలా దశాబ్దాలుగా అనేక రోదసి, సైన్స్ మిషన్స్ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థతో కలిసి పని చేస్తున్నాయని ఆమె తెలిపారు. ఇస్రో అభివృద్ధి చేస్తున్న రెండు పెద్ద ప్రాజెక్టుల గురించి సమంత ప్రస్తావించారు.
మారుతున్న వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి, విపత్తులను గుర్తించడానికి దోహదపడే నిసార్ ఎర్త్ సైన్స్ మిషన్ను అభివృద్ధిపరచడం కోసం ఇస్రో కృషి చేస్తోందని ఆమె చెప్పారు. నేటికీ సహకారం కొనసాగుతోందని సమంత క్రిస్టోఫొరెట్టి తన వీడియో సందేశంలో పేర్కొన్నారు.
గగన్యాన్ ప్రయోగం వచ్చే ఏడాదిలో జరిగే అవకాశం ఉందని సమంత క్రిస్టోఫొరెట్టి తెలిపారు. అంతరిక్షంలోకి మానవులను పంపేందుకు ఇస్రో సిద్ధమవుతూ, గగన్యాన్ కోసం కృషి చేస్తున్న ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపారు. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇతర ఏజెన్సీల తరపున శుభాకాంక్షలు చెబుతున్నానని చెప్పారు.
నాసా ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్ మిషన్ను భారత, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థలు కలిసి అభివృద్ధి చేస్తున్నాయని సమంత క్రిస్టోఫొరెట్టి చెప్పారు.నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇతర ఏజెన్సీల తరపున శుభాకాంక్షలు చెప్తున్నానని ఆమె తెలిపారు. నాసా ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్ మిషన్ ను భారత, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థలు కలిసి అభివృద్ధి చేస్తున్నాయి.