శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మహారాష్ట్ర నుండి హైడ్రోజన్ సెన్సింగ్ & అనాలిసిస్ టెక్నాలజీ యొక్క దేశీయ అభివృద్ధి కోసం ఒక హైడ్రోజన్ స్టార్టప్‌కు రూ. 3.29 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, హైడ్రోజన్ స్టార్టప్ నిధులు గత సంవత్సరం భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రారంభించబడిన జాతీయ హైడ్రోజన్ మిషన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి అనుగుణంగా ఉన్నాయని చెప్పారు. ఈ మిషన్ తన వాతావరణ లక్ష్యాలను చేరుకోవడంలో, భారతదేశాన్ని గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా చేయడంలో ప్రభుత్వానికి సహాయం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు.
ఇది 2030 నాటికి 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడంలో మరియు పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడుతుందని మంత్రి తెలిపారు. డి ఎస్ టి కింద టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్, మహారాష్ట్రలోని మల్టీ నానో సెన్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ల మధ్య దేశీయంగా హైడ్రోజన్ సెన్సార్ల తయారీకి తోడ్పాటునందించేందుకు డాక్టర్ జితేంద్ర సింగ్ సమక్షంలో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు.
కొత్త యుగం అనువర్తనాల కోసం కంపెనీ దేశీయ అత్యాధునిక హైడ్రోజన్ విశ్లేషణ సెన్సార్‌ను అభివృద్ధి చేస్తోంది. అభివృద్ధి లీక్ డిటెక్షన్/లేదా హైడ్రోజన్ విశ్లేషణ కోసం యూనివర్సల్ సూక్ష్మీకరించిన కోర్ సెన్సార్ డిజైన్లకు సంబంధించినది. పేటెంట్ పొందిన హైడ్రోజన్ గ్యాస్ సెన్సార్ మరియు ఎనలైజర్ కోర్ సెన్సార్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది పూర్తిగా భారతదేశంలో సంభావితం చేయబడింది, అభివృద్ధి చేసింది.
చైనా, అమెరికా, యుకె, జపాన్, జర్మనీ నుండి అన్ని కోర్ సెన్సార్ ఎలిమెంట్స్ దిగుమతి అవుతున్నందున, ప్రస్తుతం ఇది సెన్సార్ల దిగుమతిపై ఎక్కువగా ఆధారపడి ఉందని మంత్రి తెలిపారు. ఈ సాంకేతికతతో, భారతదేశం తమ మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తుల ద్వారా దేశీయ డిమాండ్‌ను పూర్తి చేయడానికి ప్రపంచ మార్కెట్లోకి సులభంగా చొచ్చుకుపోతుంది. సెన్సార్ కనిష్ట గుర్తింపు వంటి అనేక ప్రత్యేకమైన మరియు పాత్ బ్రేకింగ్ లక్షణాలను కలిగి ఉందని వివరించారు.