సోషల్ మీడియాలో హిందుత్వ భావన గలవారు ‘బాయ్ కాట్ లాల్‌సింగ్ చడ్డా’ ట్యాగ్‌లైన్ ట్రెండ్ చేయడంతో, ఆ చిత్రం విజయం సాధించలేకపోయింది. సోషల్‌మీడియాలో అమీర్ ఖాన్ కు కొంత మంది నెటిజన్లు మద్దతు ఇచ్చినా ఫలితం లేకపోయింది. ఈ సినిమా విడుదలకు ముందే బాయ్ కాట్ ప్రచారం కావడంతో అమీర్ ఆర్థికంగా నష్టపోయాడు.
లాల్‌సింగ్ చడ్డా మూవీతో మొదలైన బాయ్ కాట్ సెగ ఆ తర్వాత విడుదల అయ్యే సినిమాలకూ తగులుతుంది. తాజాగా సోషల్ మీడియాలో ‘లైగర్’ మూవీకి బాయ్ కాట్ ట్యాగ్‌లైన్ ట్రెండ్ అవుతుంది. అయితే కొంతమంది నెటిజన్లు విజయ్ దేవరకొండకు మద్దతుగా నిలుస్తున్నారు. సినీ పరిశ్రమలో ఎవరి మద్దతు లేకుండానే విజయ్ ఈ స్థాయికి వచ్చారని తనకి మద్దతిస్తున్నారు.
కాగా, ఆగస్టు 25న లైగర్ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో సినీ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఇందులో భాగంగా విజయ్ శుక్రవారం బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాయ్ కాట్ ట్రెండ్‌పై స్పందించాలని కోరగా ఒక సినిమాను బాయ్ కాట్ చేయడం వల్ల.. సినిమాపై జీవనోపాధి పొందుతున్న వేలాదిమందిని ఇబ్బంది పెడుతున్నట్లే. అంటూ విచారం వ్యక్తం చేశారు.
‘ఒక సినిమా ద్వారా కొన్ని వేల మందికి జీవనోపాధి లభిస్తుంది. ఉదాహరణకు లాల్‌సింగ్ చడ్డా మూవీనే తీసుకుంటే.. ఆ సినిమాపై సుమారు 3000 మంది కుటుంబాలు జీవనోపాధి పొందాయి.అమీర్‌ఖాన్ నటించిన ఆ సినిమాను ఎందు బాయ్ కాట్ చేశారో నాకు పూర్తిగా తెలియదు. దీనికి అపార్థాలే కారణం అయి ఉండొచ్చు’ అని చెప్పారు.
`బాయ్ కాట్ ట్రెండ్‌తో మీరు అమీర్‌ఖాన్ ఒక్కడినే ఇబ్బంది పెట్టడం లేదు. సినిమాపై ఆధారపడిన వారందరినీ, దేశ ఆర్థిక వ్యవస్థను ఇబ్బందిపెడుతున్నారు’ అని విజయ్ పేర్కొన్నారు. అయితే విజయ్ లాల్‌సింగ్ చడ్డాపై మాట్లాడడం నచ్చనందుకే తాను నటించిన లైగర్ మూవీకి వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నట్లు కొంతమంది నెటిజన్లు స్పందిస్తున్నారు. మరికొంతమందేమో ‘లైగర్’ మూవీకి కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరించడం వల్లే వ్యతిరేకిస్తున్నట్లు బాయ్ కాట్ ట్యాగ్‌లైన్‌తో ట్వీట్ చేస్తున్నారు.