విద్యుత్ ప్రసార & పంపిణీ (టి&డి- ట్రాన్స్మిషన్ & డిస్ట్రిబ్యూషన్) వ్యవస్థ, ఉక్కు వ్యవస్థలు, ఉక్కు ఇఆర్డబ్ల్యు పైపులు, పాలిమర్ ఉత్పత్తులు తదితరాల ఉత్పత్తిలో నిమగ్నమై ఉన్న కొలకతాలోని ప్రముఖ గ్రూప్‌పై ఆదాయ పన్ను శాఖ సోదాలు, స్వాధీనం ఆపరేషన్‌ను నిర్వహించారు.
సోదాలు భాగంగా పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్లలో విస్తరించి ఉన్న 28 ఆవరణలలో జరిగాయి. ఇప్పటివరకూ మొత్తం రూ. 250 కోట్లకు పైగా లెక్కల్లోకి ఆదాయాన్ని కనుగొన్నారు. సోదాలు నిర్వహిస్తున్న క్రమంలో గ్రూపు చేపట్టిన వివిధ పన్ను ఎగవేత పద్ధతులను కనుగొన్నారు. నకిలీ ఖర్చును బయిటపెట్టే పత్రాలు, డిజిటల్ డాటా, వెల్లడించని నగదు అమ్మకాల వంటి నేరారోపణ సాక్ష్యాలు పెద్ద ఎత్తున వెలుగులోకి వచ్చాయి.
అంతేకాకుండా, స్తిరాస్తుల కొనుగోలు, లెక్కలో చూపని నగదు రుణాల కోసం లెక్కల్లో చూపని నగదును ఉపయోగించిన సాక్ష్యాలను కనుగొని, స్వాధీనం చేసుకున్నారు. తన ప్రధాన పనులకు అకామడేషన్ ఎంట్రీలను అందించేందుకు అనేక షెల్ కంపెనీలను గ్రూప్ ఉపయోగించుకున్నట్టు స్వాధీనం చేసుకున్న సాక్ష్యాల ప్రాథమిక విశ్లేషణ వెల్లడించింది.
లెక్కల్లో చూపని డబ్బును వాటా మూలధనం/ అసురక్షిత రుణం ముసుగులో గ్రూపు వ్యాపారంలోకి షెల్ కంపెనీలు తిరిగి పంపినట్టు కనుగొన్నారు. ఇందుకు అదనంగా, అనేక షెల్ కంపెనీల అల్లిక ద్వారా మొత్తం రూ. 150 కోట్లకు పైగా విలువైన అకామడేషన్ ఎంట్రీలను కూడా కనుగొన్నారు.