గ్రూప్ దశలో పాకిస్తాన్‌ను చిత్తుచేసిన భారత్ సూపర్-4లోచివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో పాక్ జట్టు ఆరు వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. భారతజట్టు నిర్దేశించిన 182పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్ జట్టు చివరి 12 బంతుల్లో 26పరుగులు చేయాల్సి వచ్చింది.
ఆ దశలో భువనేశ్వర్ వేసిన 19వ ఓవర్లో ఏకంగా 19 పరుగులు రాబట్టడంతో ఫలితం తారుమారైంది.ఇక చివరి 6 బంతుల్లో 7 పరుగులు చేయాల్సి రాగా ఆర్ష్‌దీప్ వేసిన తొలి బంతికి సింగిల్, రెండో బంతికి ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత బంతి డాట్ కాగా.. నాల్గో బంతికి ఆసిఫ్ అలీ ఔటయ్యాడు.
ఈ క్రమంలో చివరి 2బంతుల్లో 2 పరుగులు చేయాల్సిన పాక్ జట్టును కొత్త బ్యాటర్ ఇఫ్తికార్ అహ్మద్ 2పరుగులు చేయడంతో పాక్జట్టు విజయం సాధించింది. దీంతో పాక్ జట్టు 19.5ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 182పరుగులు చేసి విజయం సాధించింది.
పాకిస్తాన్ జట్టు గెలుపులో ఓపెనర్ రిజ్వాన్(71) కీలకపాత్ర పోషించాడు. టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాను కెప్టెన్ రోహిత్, కెఎల్ రాహుల్ శుభారంభం అందించారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 5.1ఓవర్లలో 54పరుగులు జతచేశారు. ఈ క్రమంలో రోహిత్ 28పరుగుల వ్యక్తిగత స్కోర్వద్ద ఔటయ్యాడు.
ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. మరో ఎండ్‌లో కెఎల్ రాహుల్ కూడా 28పరుగులే చేసి పెవీలియన్‌కు చేరడంతో టీమిండియా 62పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది.
ఆ తర్వాత సూర్యకుమార్(13), పంత్(14), హార్దిక్(0), హుడా(16) ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా విరాట్ చివరి ఓవర్‌వరకు క్రీజ్‌లో నిలిచి టీమిండియా భారీస్కోర్‌కు దోహదపడ్డాడు. 44బంతులను ఎదుర్కొన్న కోహ్లి 4ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 60పరుగులు చేసి రనౌటై పెవీలియన్‌కు చేరాడు.
182పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టును ఓపెనర్ రిజ్వాన్(71) ఆదుకున్నాడు. కెప్టెన్ బాబర్(14) త్వరగా పెవీలియన్‌కు చేరినా.. ఫకర్ జమాన్(15), మహ్మద్ నవాజ్(42)లతో కలిసి అర్ధసెంచరీని సాధించాడు. నవాజ్(42), ఆసిఫ్(16) చివర్లో మ్యాచ్‌ను గెలిపించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రిజ్వాన్‌కు లభించగా.. మంగళవారం భారతజట్టు సూపర్-4లో శ్రీలంకతో తలపడనుంది.