సెప్టెంబర్ 17 విముక్తా? విలీనమా? – 2
నిజాం ప్రభుత్వంలో “ఉమూర్ మజహార్” అనే దెవాదాయ శాఖా ద్వారా “దీన్ దార్” అనే సంస్థకు నిధులందేవి. దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లోని “ఆసీఫ్ నగర్ “లో వుంది. దీన్ దార్ నాయకుడు సిద్దీఖీ దీన్ దార్. ఈయన తనకు తాను చెన్న బసవేశ్వరుడి అవతారుడుగా చెప్పుకొన్నాడు.
1929 లో లింగాయత్ సాంప్రదాయానికి ఆధునిక రూపమే ఇస్లాం అనే వాదన చేశాడు. హిందూ దేవతలను అవమాన పరుస్తూ, హిందువులంతా ఇస్లామ్ లోకి మారాలని ప్రచారం చేసేవాడు. మతమార్పిడులు చేసేవాడు. తాను కల్కి అవతారమని, వీర భోగ వసంత రాయడనని, నిజాం అవతార పురుషుడని, అతని ప్రస్తావన వేదాలు, ఖురాన్ లో వుందని వంచించే ప్రయత్నం చేశాడు.
హిందూ దేవాలయాలు ధ్వంసం అవుతాయని, గాంధీ ఇస్లాం స్వీకరిస్తారని, నెహ్రూ మానసికంగా ముస్లిం అవుతాడని జోస్యం చెప్పాడు. హుబ్లీ, ధార్వాడ, గుల్బర్గా, బీదర్ లలో అనేక మంది మతమార్పిడి గావింఛారు. కాని చాలామందిని తిరిగి హిందూ ధర్మం లోకి ఆర్యసమాజం తీసుకొని వచ్చింది. అందువల్ల ఆర్యసమాజం నాయకుడు అయిన స్వామి శ్రద్దానందను 1926 డిసెంబరు 23 న నిజాం హత్య చేయించాడు.
బీహార్ నుండి సర్ అలీ ఇమాం, సర్ హసన్ ఇమాం అను ఇరువురు నిజాం సంస్థానానికి వచ్చారు. సర్ అలీ ఇమాంను తన ప్రధానమంత్రిగా నియమించుకున్నాడు నిజాం. వీరు మంచి విద్యావంతులు. కాని ఒక కొత్త కుట్రకు తెర లేపాడు సర్ అలీ ఇమాం.
అదేమిటంటే గోదావరి లోయ, రామగుండం, గోదావరిఖని, పాల్వంచ, చెన్నూరు, ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో అఫ్ఘనిస్తాన్ లోని వజీరిస్తాన్ నుండి వేలాది పఠాన్ కుటుంబాలను తరలించి, స్థానిక హిందువులను తరిమేయాలని చూశాడు.
కాని ఈ కుట్ర మధ్యలో ఆగిపోయింది. హసన్ ఇమాం తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అల్లా మమష్రకి అనే వాడి పర్యవేక్షణలో “ఖాక్సర్”పార్టీ ని స్థాపించారు. ఇందులోని సభ్యులను “బేల్ఫా ఫౌజ్” అనే వారు. “బేల్ఫా”అంటే గొడ్డలి. గొడ్డలి ద్వారా హిందువులను అంతం చేయడమే ఈ పార్టీ ముఖ్యోద్దేశం.
హిందూ నగరాల పేర్లను వరుసగా మార్చారు భాగ్యనగర్ ను హైదరాబాద్, వీరపట్టణంను ఇబ్రహిం పట్నం, ఇందూరును నిజామాబాద్, పాలమూరును మహబూబ్ నగర్, మానుకోటను మహబూబా బాద్, ఎదులాపురంను ఆదిలాబాద్.. ఇలా ఎన్నో నగరాల పేర్లను మార్చారు.
హిందువుల పట్ల వివక్ష
హిందువులను ఆర్థికంగా అణిచివేసి, తద్వారా మతమార్పిడి చేయాలని నిజాం భావించాడు. అందుకోసం ఎంఐఎం/రజాకర్లను వాడుకొన్నాడు. హిందువుల పై పన్నులు పెంచడం, .రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని రజాకర్లచే ధ్వంసం చేయించడం లేదా దొంగిలించటం, వారి విద్యా, ఉపాధి అవకాశాలు దెబ్బతీయటం వంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు.
దాదాపు 88 శాతంగా ఉన్న తెలుగు ప్రజలకు విరుద్ధంగా ఉర్దూను ప్రవేశపెట్టారు. నిజానికి పాకిస్తాన్ పిత అయిన మహ్మద్ అలి జిన్నాకు ఉర్దూ రాదు. ఆయన మాతృభాష గుజరాతి. మిల్లు కార్మికుల సంఖ్య 20 వేలు అయితే అందులో 15 వేలమంది ముస్లింలే. ప్రభుత్వోద్యోగులు 60 వేలయితే 46 వేల మంది ముస్లింలే. పోలీసుల సంఖ్య 52,000 అందులో 46,000 పైచిలుకు ముస్లింలే.
నిజాం రాజు మొదటి ప్రపంచ యుద్దంలో బ్రిటిష్ వారికి ఆర్థిక సహాయం అందించాడు. అందుకుగాను “హిజ్ ఎక్సల్టెడ్ హైనెస్” అనే బిరుదు పొందాడు. నిజాం క్రైస్తవుల పట్ల ఉదారంగా వుండేవారు. 1914లో ప్రారంభమైన మెదక్ పాస్నెంట్ చర్చ్ 1924 లో పూర్తి అయ్యింది. ఈ చర్చ్ చార్మినార్ కంటే ఎత్తుండకూడదని 173 అడుగులకే అనుమతించాడు. చార్మినార్ ఎత్తు 175 అడుగులు.
నిజాం ఒక ధన పిశాచి
సర్ఫే ఖాస్ నుండి వచ్చే ఆదాయం కాకుండా సంవత్సరానికి రూ.70 లక్షల ప్రజాధనం వాడుకునేవాడు. కోఠీలో కమాల్ ఖాన్ అనే పెద్ద జాగీర్ధార్ అద్భుతమైన భవనం నిర్మించుకొన్నాడు. అది చూడడానికి వచ్చిన నిజాం దాని అందానికి ముగ్దుడై ఆ భవనాన్ని తనకు బహుమతిగా ఇవ్వాలని ఆదేశించాడు. దాంతో చేసేది లేక కమాల్ ఖాన్ ఆ భవనాన్ని ఇచ్చాడు. అదే కాలక్రమంలో కింగ్ కోఠి గా పిలువబడుతోంది.
ఎవరైనా రెండు అష్రఫీలు (తులం బంగారం ) నజరాన ఇస్తే, జంగ్, నవాబ్ జంగ్, యార్ జంగ్ బిరుదులు ఇచ్చేవాడు. భూమిశిస్తుతో పాటు ప్రతి రూపాయికి ఒక అణా లోకల్ ఫండ్, అర అణ బంచ్ రాయ్, ఒక అణా నిజాంకు నజరాన ఇచ్చేవారు. “సాల్ గిరా”అనే రాజు పుట్టిన రోజు పండగకు కానుకలు సమర్పించటం ఆనవాయితీ.
జాగిర్దార్లు చనిపోతే వారసుల నుంచి నజరాన స్వీకరించి ఆస్తి మార్పిడి చేయటం, వారసులు కనుక లేకపోతే ఆస్తి జప్తు చేయటం జరిగేది. నిజాం ప్రతిరోజూ కొత్త బట్టలు ధరించే వాడు. బట్టలు కుట్టడానికి ఆస్థాన దర్జీలు ఉండేవారు. నగరంలో ఎవరైనా కొత్త కారు కొంటే, అది కనుక నిజాంకు నచ్చితే చాలు, అది దక్కించుకొనేవాడు. ఇలా వంద కార్ల పై చిలుకు దక్కించుకొని, ప్రపంచంలోనే అత్యధిక కార్లు వున్న రాజుగా పేరుగాంచాడు. నిజాం పర్యటనకు వెళుతున్నప్పుడు మధ్యలో పెళ్ళిళ్ళు జరుగుతుంటే ఆగి,ఆ పెళ్ళి కూతుళ్ళు గనుక నిజాంకు నచ్చితే వెంట తీసుకెళ్ళేవాడు.
రజాకర్ల/ఎంఐఎంల నరమేధం
నవంబర్ 2,1946లో పాత సూర్యాపేట పై అర్ధరాత్రి దాడి చేసి అమాయక జనాలను ఊచకోత కోశారు. డిసెంబర్ 1,1946 నాడు మల్లారెడ్డిగూడెంపై దాడిచేసి చింద్రాల గురవమ్మ, బొండమ్మ, అంకాలమ్మ అనే దళిత మహిళలను అవమానకర పద్దతులలో చంపారు.
ఆగస్ట్ 11 1946లో ఆదివారం రోజున వరంగల్ తూర్పు కోట ముస్లింలు, 200 మంది రజాకర్లు ఖాసీం షరీప్ నాయకత్వంలో మొగిలయ్య గౌడ్ ఇంటిపై దాడిచేసి, అతని పొట్టలో బర్సిని దింపి పేగులు బయటకు లాగి చంపాడు షరీఫ్. మొగిలయ్య గౌడ్ అన్న రామస్వామి గౌడ్ ను కూడా కిరాతకంగా చంపి వారి రక్తాన్ని షరీఫ్ తన ముఖానికి రాసుకొని వారి తల్లిని కొట్టి, విజయగర్వంతో బర్సిని పైకెగరేసుకుంటూ వరంగల్ నగరంలో ఊరేగాడు.
ఆగస్టు 14, 1946లో ప్రముఖ డాక్టర్ నారాయణ రెడ్డి పేదల వైద్యుడు గా పేరొందాడు. ఆయన వద్ద ముస్లింలు కూడా ఉండేవారు. అందులో వరంగల్ నగర ఎంఐఎం అధ్యక్షులుకూడా వున్నారు. కాని ఆ డాక్టరు ను చంపిన వారిలో ఎంఐఎం అధ్యక్షుడు ప్రధాన సూత్రదారి అని కాళోజి నారాయణరావు ఆరోపించారు.
మార్చ్ 14.1948 లో హుస్నాబాద్ కు సమీపంలో మంగాపురం కొండలవద్ద కరినగర్ సింహాం, అనభేరి ప్రభాకర్ రావును, మరో 9 మందిని అతి కిరాతకంగా చంపారు. మార్చ్ 14 1948 లో బసిరెడ్డి పల్లెలో సిరిసిల్లా తాలూకా ముద్దుబిడ్డ సింగిరెడ్డి భూపతి రెడ్డిగారిని దారుణంగా చంపారు.
మిట్టా యాదవ రెడ్డి సహా తాటికొండ పోరాటంలో 30 మంది యువకులను రకరకాలుగా హింసించి జీవచ్ఛవాల్లాగా మార్చారు. సెప్టెంబర్-1, 1948 లో జోడేన్ ఘాట్ లో కొమురం భీం సహ 12 మంది గిరిజనులను అమానుషంగా హత్య చేశారు. పాలకుర్తిలో చాకలి ఐలవ్వ పోరాట తీరు మరువ లేనిది. వేంకటేశ్వర పల్లే మక్తేదార్ మొఘల్ మియా అలియాస్ సలావుద్దిన్. ఈయన ఆకృత్యాలు చెప్పనలవి కానివి. అందమైన స్త్రీలు కనిపిస్తే చాలు, వారిని వారి కుటుంబ సభ్యుల ముందే రేప్ చేసేవాడు. ఎదురుతిరిగితే వారి ఇండ్లు, గడ్డివాములు ధ్వంసం చేసేవాడు.
హిందూ స్త్రీలను ముస్లింలు అపహరించుకు పోవటం పరిపాటి. “ఓడపల్లి సత్తెయ్య అనే దర్జీ కూతురును మహ్మద్ ఖాసీం ఎత్తుకెళ్ళాడు. ఇంకా కొత్తగట్టు జనార్దన్ కూతురును, మొగళ్ళపల్లెలో ఒక విశ్వబ్రాహ్మణ స్త్రీని, రాజుపేటకు చెందిన ఒక మూగ స్త్రీ ని ముస్లింల చెరనుండి ఆర్యసమాజం కాపాడింది. ఇలాంటి సంఘటనలు వేలాదిగా జరిగాయి. ఇవి మచ్చుకు కొన్నిమాత్రమే.
1947 ఫిబ్రవరి లో హుజూరాబాద్ తాలూకా మల్లంపల్లికి చెందిన గోనే కొమురయ్యను పశువుల కొట్టంలో కట్టివేసి నిప్పంటించి సజీవ దహనం చేశారు. ఆగస్టు 21 1948 న రాత్రి 10 గంటలకు ఇమ్రోజ్ పత్రికా స్థాపకులు షోయబుల్లాఖాన్ ను చంపి శరీరాన్ని ముక్కలు చేసి తలను ఖాసీం రజ్వీ కి బహుమతి గా పంపాడు అబ్దుల్ మునీం ఖాన్.
చింతలగూడెం నివాసి, చింతపట్ల మల్లయ్యను పట్టుకొని ఆయన కొండనాలుకకు, పెద్దనాలుకకు సూదితో కుట్టు వేసి హింసించి, ప్రతి ఇంటి నుండి ఒక కట్టెను అడుక్కోమని చెప్పి, ఆ కట్టెలపై అతన్ని సజీవ దహనం చేశారు. 1947లో గాండ్లాపూర్ లో హిందూ స్త్రీల చే నగ్నంగా బతుకమ్మ ఆడించారు. నేరడ గ్రామంలో 70 మంది స్త్రీలకు ఫైజామాలు తొడిగించి అందులోకి తొండలను వదిలారు. మిర్యాలగూడ లోని నడిగడ్డ గ్రామంలో చాకలి లచ్చమ్మను తలకిందులుగా చెట్టుకు వేలాడదీసి చిత్రహింసలు పెట్టారు.
ఏప్రిల్ 10, 1948 న పాలమూరు జిల్లాలోని బోర్ పల్లి పై దాడిచేసి దళిత యువకుల పురుషాంగాలకు కిరోసిన్ తో తడిపిన గుడ్డలు కట్టి నిప్పంటించారు. వారు హాహాకారాలు చేస్తుంటే వారి భార్యలను మానభంగం చేశారు. ఆ అవమానం తట్టుకోలేక దళిత యువతులంతా ఆత్మహత్య చేసుకొన్నారు. హిందూ స్త్రీల రొమ్ములను పట్టుకారుతో లాగడం, పిరుదులపై గిల్లటం, తల్లుల యెదుటే కూతుళ్ళను మానభంగం చేయటం సర్వసాధారణం.
జూలై 5 1948 న గుల్బర్గా లోని సైదాబాద్ లో 15 మందిని, హుజూర్ నగర్, మిర్యారగూడలోని నీలాయగూడెంలో 21మందిని, మానుకోట తాలూకా బలుపాలో 15 మందిని, ఇల్లందు తాలూకా సీమలపాడులో 70 మందిని, జనగామా తాలూకా నర్మెట, నంగునూరులో 80 మందిని చెరిచారు. నగరంలో ఒక స్త్రీని చెరిచి, చంపి రోడ్డు ప్రక్కన పడేసి పోయారు. భువనగిరి తాలూకా నారిగూడెంలో పచ్చిబాలింతపై, ఎనుపాడులో నిండుగర్భిణి పై అత్యాచారం చేశారు రజాకర్లు.
ఆగస్టు 27 1948 న 400 మంది నిజాం సైనికులు బైరాన్ పల్లిపై దాడిచేసి 118 మందిని వరుసగా నిలబెట్టి కాల్చిచంపారు. ఈ దాడిలో నల్గొండ జిల్లా కలెక్టరు మొహాజ్జం హూసేన్, డిప్యూటి కలెక్టరు ఇక్బాల్ హాసీం స్వయంగా కాల్పులు జరిపారు. శవాలన్నింటిని ఊరి బయట పాడుపడిన బావిలో పడేశారు. అందులో ఒక సజీవ శిశువు కూడా వున్నారు.
ఈ దాడితో ప్రభుత్వం కూడా ఇస్లాం రాజ్య స్థాపన కోసం ప్రయత్నించినట్లు ప్రపంచం గుర్తించింది. హిందువులను హింసించటం, వారి శరీర భాగాలను నరికి వారితోనే తినిపించటం అనేది ఎంఐఎం/రజాకర్లకు సంతోషాన్నిచ్చే ఒక పైశాచిక క్రీడ.
విడ్డూరమైన విషయం ఏమిటంటే సెప్టెంబర్ 17ను మహారాష్ట్ర లో “మరాఠ్వాడా సంగ్రామ్ ముక్తి దివస్” పేరున, కర్ణాటకలో “హైదరాబాద్-కర్ణాటక విభజన దినం” పేరున ప్రతి సంవత్సరం అధికారికంగా, నిర్వహిస్తూ, జాతీయ జండా ఎగుర వేస్తున్నారు. పోరాటయోధుల కుటుంభ సభ్యులను/వారసులను సత్కరిస్తున్నారు.
కానీ దౌర్భాగ్యం ఏమిటంటే తెలంగాణా ఏర్పడక ముందు సమైక్యవాదులను విమర్శించిన కేసీఆర్/టిఆర్ఎస్ ఇప్పుడు ఎంఐఎంతో జతకట్టి, తెలంగాణా విముక్తి కోసం సమిధలైన యోధులను అపహాస్యం చేస్తోంది. 15 నిమిషాలలో హిందువుల అంతం చేస్తానన్న రజాకర్లతో చెలిమి చేయడమంటే, తెలంగాణా చరిత్రను అవమానించమే గదా!
మరింత సమాచారం కోసం సంప్రదించిన పుస్తకాలు:
1.తెలంగాణా సాయుధ పోరాటం 2.హైదరాబాద్ జీవిత చరిత్ర(సోషల్ మీడియా పోస్టింగ్ ఆధారంగా)