విమోచన దినోత్సవం రోజున సెలవు ప్రకటించడం..తెలంగాణను అవమానించినట్లేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా తెలంగాణ బిజెపి రాష్ట్ర కార్యాలయంలోజాతీయ జెండాను ఎగురవేస్తూ
ప్రభుత్వ కార్యాలయాలకు స్కూల్స్ కి ముఖ్యమంత్రి కేసీఆర్ సెలవు ప్రకటించడం అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేసారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్ర పటానికి బండి సంజయ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ నివాళులు అర్పించిన, అనంతరం సంజయ్ జాతీయ జెండా ఎగురవేశారు.
ఈ సందర్భాంగా సంజయ్ మాట్లాడుతూ..’స్వాతంత్య్రం వచ్చిన ఏడాది తర్వాత తెలంగాణకు నిజాం పాలన నుంచి విముక్తి లభించింది. ఏడాదిపాటు నరకయాతన భరించారు. మహిళలపై వారు చేసిన అకృత్యాలు అత్యంత ఘోరమైనవి. సెప్టెంబర్ 13 న ఆపరేషన్ పోలోను పటేల్ ప్రారంభిస్తే 17వ తేదీన విముక్తి లభించిందని గుర్తు చేశారు.
1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వస్తే తెలంగాణకు మరుసటి ఏడాది వచ్చిందని అన్నారు. అప్పటి నిజాం వల్ల తెలంగాణ ప్రజలు నానా తిప్పలు పడ్డారని చెప్పారు. తుగ్లక్ ఆలోచనలతో విర్రవీగిన నిజాం.. సర్దార్ పటేల్ ఆపరేషన్ పోలోతో తోక ముడిచిన విషయాన్ని గుర్తు చేశారు.
చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య వంటి ఎందరో మహామహులు నిజాంకు వ్యతిరేకంగా పోరాడారని నివాళులు అర్పించారు. దీన్ని విమోచన దినోత్సవం అంటారనిఅంటూ దీన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ ఎన్నో ఏండ్లుగా పోరాటం చేసిందని గుర్తు చేశారు.
కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించిన తర్వాత కానీ కేసీఆర్ దిగిరాలేదని ఎద్దేవా చేశారు. దారుస్సలాం నుంచి అనుమతి లభించాకే తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించిందంటే ఎంత నీచమైన స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చని సంజయ్ విరుచుకుపడ్డారు.