సెంటియెంట్ ల్యాబ్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్, మొట్టమొదటి దేశీయంగా అభివృద్ధి చేసిన హైడ్రోజన్ ఇంధన సెల్ బస్సును బుధవారం పూణెలో ప్రదర్శించింది.
మార్కెట్ లోకి ఈ బస్సు రావటం వల్ల ముఖ్యంగా ప్రజా రవాణా, వాణిజ్య రవాణ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు రాగలదు. మన పెట్రోల్, డీజిల్ దిగుమతులు కూడ తగ్గుతాయి..
విశేషం ఏమిటంటే, వ్యవసాయ అవశేషాల నుండి నేరుగా హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసి, దానితో నడిచే ఫ్యూయల్ సెల్ సాంకేతికతను ప్రపంచంలోనే మొట్టమొదటి సంస్థ సెంటియెంట్ చేసింది. ఈ బస్సు,కేవలం 30 కిలోల హైడ్రోజన్‌ను ఉపయోగించుకుంటూ 450 కి.మీ దూరం వెళ్తుంది
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, నేషనల్ కెమికల్ లాబొరేటరీ, సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ల సహకారంతో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ అభివృద్ధి చేయబడింది.