సైనిక కుటుంబాలను అభ్యంతరకంగా చూపించారని నిర్మాతలైన ఏక్తాకపూర్, శోభా కపూర్ లపై కేసుపెట్టగా వారెంట్ ని జారీ చేశారు. నిర్మాత ఏక్తాకపూర్ సినిమాలతో పాటు సీరియళ్లు, వెబ్ సరీస్ లను కూడా నిర్మిస్తూ చాలా బిజీగా ఉన్నారు. తన వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ చేయడానికి ఆమె ‘ఆర్ట్ బాలాజీ’ అనే ఓటీటీ ప్లాట్ ఫామ్ ను కూడా ఏర్పాటు చేశారు.
తాజాగా ఆమె ‘ఎక్స్ఎక్స్ఎక్స్’ అనే వెబ్ సిరీస్ ను నిర్మించారు. ఈ సిరీస్ రెండు సీన్లు మంచి వ్యూస్ ని సాధించాయి. తాజా సిరీస్ లో సైనిక కుటుంబాలను అభ్యంతరకరంగా చూపించారని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, బీహార్ లోని బేగుసరైలో ఈ సిరీస్ నిర్మాతలైన ఏక్తా కపూర్, ఆమె తల్లి శోభ కపూర్ లపై కేసు నమోదయింది.
2020లో శంభు కుమార్ అనే మాజీ సైనికుడు వీరిపై కేసు వేశారు. కేసు విచారించిన కోర్టు ఏక్తా, శోభలపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మాజీ సైనికుడు శంభు కుమార్ 2020లో ఫైల్ చేసిన ఈ కేసుని తాజాగా విచారించిన జడ్జి వికాస్ కుమార్ ఆ చిత్ర నిర్మాత ఏక్తా, శోభల మీద అరెస్టు వారెంట్ జారీ చేశారు.
నివేదికల ప్రకారం.. శంభు కుమార్ తరపు న్యాయవాది హృషికేష్ పాఠక్ మాట్లాడుతూ.. ‘ఏక్తా కపూర్ సారథ్యంలోని బాలాజీ టెలిఫిల్మ్స్ లిమిటెడ్ యాజమాన్యంలోని ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ‘ఆల్ట్ బాలాజీ’లో ఈ సిరీస్ ప్రసారం అయ్యింది. శోభా కపూర్‌కి కూడా బాలాజీ టెలిఫిల్మ్స్తో సంబంధం ఉంది’ చెప్పారు. ‘కోర్టు వారికి (నిర్మాతలకు) సమన్లు జారీ చేసింది. ఈ విషయానికి సంబంధించి తమ ముందు హాజరు కావాలని కోరింది.
అయితే వారు అభ్యంతరం తర్వాత సిరీస్‌లోని కొన్ని సన్నివేశాలను తొలగించామని కోర్టుకు తెలియజేశారు. కానీ వారు కోర్టుకు హాజరు కాకపోవడంతో వారిపై వారెంట్ జారీ చేశారు’ అని హృషికేష్ తెలిపారు. మరోవైపు ఎంతో పేరు ఉన్న ఏక్తాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అడల్ట్ కంటెంట్ ద్వారా డబ్బులు సంపాదించుకోవాలనుకోవడం దురదృష్టకరమని విమర్శిస్తున్నారు.