టెలికాం రంగంలో 5జీ సేవలు విప్లవాత్మక మార్పులు తేనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఢిల్లీలోని స్థానిక ప్రగతి మైదానంలో నాలుగు రోజులపాటు జరిగే ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసి) ఆరో ఎడిషన్‌ను ప్రారంభించి, 5 జి సేవలను శనివారం ప్రధాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5జి సేవల ప్రారంభం 21వ శతాబ్ధంలో దేశానికి చరిత్రాత్మక సంఘటనగా నిలుస్తుందని పేర్కొన్నారు.
డిజిటల్ ఇండియా సాధించిన విజయంగా దీనిని ఆయన అభివర్ణించారు. ఈ సాంకేతికత ఆవిష్కరణతో ప్రతి ఇంటికీ ఇంటర్నేట్, సూతన సాంకేతిక పరిజ్ఞానం చేరగలదన్న నమ్మకం తనకుందని చెప్పారు. డిజిటల్ ఇండియా సంపూర్ణ లక్ష్య సాధన డిజిటల్ వివైస్ ధర, డిజిటల్ కనెక్టివిటీ, డిజటల్ డేటా ధర, డిజిటల్ ఫస్ట్ అప్రోచ్ అనే అంశాలపై ఆధారపడి ఉంటుందని చెప్పారు.
014లో దేశం నుండి మొబైల్ ఫోన్ల ఎగుమతి జరిగేది కాదని, ఇప్పుడు వేల కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఫోన్లను ఎగుమతి చేస్తున్నామని చెప్పారు. దీంతో దేశంలో ఫోన్ల ధర కూడా గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. ఈ దేశంలో కొత్త శకానికి ఇదో ముందడుగు అని చెప్పారు. అపరిమిత అవకాశాలకు కూడా ఇది ఆరంభమే అని ప్రధాని తెలిపారు.
5జీ టెక్నాలజీ విషయంలో నవభారత్ కేవలం ఓ వినియోగదారుడిగా ఉండిపోదు అని, ఆ టెక్నాలజీ అభివృద్ధి విషయంలోనూ క్రియాశీల పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచంలో సాంకేతిక అభివృద్ధిలో ఇండియా ఇక దూసుకువెళ్తుందని ప్రధాని తెలిపారు.
5జి సాంకేతికత వేగవంతమైన ఇంటర్నెట్ యాక్సెస్‌కు మాత్రమే పరిమితం కాదని, జీవితాలను మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు. మొదటి మూడు పారిశ్రామిక విప్లవాల నుంచి దేశం ప్రయోజనం పొంది ఉండకపోవచ్చు, కానీ నాల్గో పారిశ్రామిక విప్లవం నుంచి దేశం పూర్తి ప్రయోజనం పొందుతుందని ప్రధాని తెలిపారు. వాస్తవానికి దానికి నాయకత్వం వహిస్తుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.
కాగా, అక్కడ ఏర్పాటు చేసిన ఎరిక్సన్ స్టాల్ నుంచి 5జీ కనెక్షన్ ద్వారా రిమోట్ మోడ్‌లో ప్రధాని మోదీ స్వీడన్లో కారును డ్రైవ్ చేశారు.యూరప్‌లోని ఇండోర్ కోర్స్‌లో వాహనాన్ని ఉంచగా కంట్రోల్స్ ఇవ్వడం ద్వారా కారును నడిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ రిలయన్స్ పెవిలియన్‌ను సందర్శించి జియో గ్లాస్ ద్వారా ట్రూ 5జీ డివైజ్‌లను పరిశీలించారు.
ఇక భారత్‌లో 5జీ సేవలను ప్రధాని లాంఛనంగా ప్రారంభించడంతో యూజర్లు దీపావళి నుంచి 5జీ సేవలను ఆస్వాదించనున్నారు. ఎయిర్టెల్, రిలయన్స్ జియో వంటి టెలికాం కంపెనీలు త్వరలో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్ 23 నాటికి దేశం నలుమూలలా అన్ని పట్టణాలు, గ్రామాల్లో జియో సేవలు ప్రారంభిస్తామని ఐఎంసీ వేదికపై ఆర్ఐఎల్ అధినేత ముఖేష్ అంబానీ వెల్లడించారు.