ఉగ్రవాదుల భారీ కుట్రను హైదరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. ఆర్ఎస్ఎస్, బిజెపి నేతలపై దాడులతో పాటు పేలుళ్లకు జాహిద్ కుట్ర పన్నాడు. ఉగ్రవాద కార్యకలాపాల కోసం యువకులను జాహిద్ రిక్రూట్ చేసుకున్నాడు. ఇప్పటికే ఆరుగురు యువకులను ఉగ్రవాద సంస్థల కోసం జాహిద్ రిక్రూట్ చేసుకున్నాడు.
అబ్దుల్ జాహెద్, మాజ్ హసన్ ఫారూఖ్, మహ్మద్ సమియుద్దీన్ లను అరెస్టు చేసి, వారి నుంచి నాలుగు హ్యాండ్ గ్రెనేడ్ లు, రూ.5.50 లక్షల నగదు, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ముసారాంబాగ్ లో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు జాహిద్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
అబ్దుల్ జాహెద్ కు పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐతో లింకులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లో ఉగ్రదాడులు చేసేందుకు పాక్ నుంచే అతడికి నిధులు, నాలుగు హ్యాండ్ గ్రెనేడ్స్ అందాయని వెల్లడించారు. దసరా ఉత్సవాలను జాహిద్ అండ్ టీమ్ టార్గెట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దసరా రోజు జరిగే ఉత్సవాల్లో మూకుమ్మడి దాడులకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ సీసీఎస్, సిట్‌లో జాహిద్ అండ్ టీమ్‌పై కేసు నమోదు చేశారు.
జాహిద్‌తోపాటు ఏడుగురిపై సిట్ కేసు నమోదు చేసింది. సుజి, సమియుద్దిన్, అదీల్ అఫ్రోజ్, అబ్దుల్, సోహెల్ ఖురేషి, అబ్దుల్ కలీమ్‌లపై కేసు నమోదు చేశారు. పాకిస్తాన్లో ఉన్న హ్యాండ్లర్స్ ద్వారా జాహిద్‌కు నిధులు అందినట్లు పోలీసులు వెల్లడించారు. టెర్రర్ దాడుల కోసం పాక్ నుంచి ఉగ్రవాదులు గ్రనేడ్స్ పంపినట్లు తెలిపారు.
నగరంలో జనం రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలతో పాటు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యాలయాలు, దసరా ఉత్సవాలు జరిగే ప్రాంతాలు లక్ష్యంగా దాడులు చేయాలని జాహెద్ అండ్ టీం ప్లాన్ చేసిందని పోలీసులు చెప్పారు. జన సామర్థ్యం ఉన్న ప్రాంతాల్లో మూకుమ్మడి దాడులకు కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్లోలో పేలుళ్లతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని కుట్ర పన్నారు.
మాజ్ హసన్ ఫారూఖ్, మహ్మద్ సమియుద్దీన్ లతో కలిసి అబ్దుల్ జాహెద్ గ్రెనేడ్ దాడులకు సంబంధించిన ప్లానింగ్స్ చేశాడని వివరించారు. అబ్దుల్ జాహెద్ తో పాటు ఏడుగురి పై సిట్ కేసు నమోదు చేసింది.