హైదరాబాద్ లోని ఎల్అండ్ మెట్రోరైల్ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎకనమిక్ టైమ్స్ ఇన్ఫ్రా ఫోకస్ అవార్డు 2022ను రవాణా రంగం విభాగంలో అందుకుంది. ఎల్ అండ్ టీఎంఆర్హెచ్ఎల్ ఎండీ సీఈఓ కెవీబీరెడ్డి ఈ ట్రోపీని డిల్లీలోని హయత్ రీజెన్సీ వద్ద నిర్వహించిన ఎకనమిక్ టైమ్స్ ఇన్ఫ్రా ఫోకస్ సమ్మిట్ అవార్డుల వద్ద అందుకున్నారు.
హైదరాబాద్‌లో ప్రపంచ శ్రేణి నగర రవాణా వ్యవస్దను రూపొందించినందుకు అవార్డు అందజేశారు. సేవలు, నిర్వహణ పరంగా పలు మైలురాళ్లను చేరుకుంది. ఈవార్డు అందుకోవడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేసిన కెవీబీరెడ్డి మాట్లాడుతూ ఈగుర్తింపును అందించిన ఎనకమిక్ టైమ్స్‌కు ధన్యవాదాలు తెలిపారు.
“ప్రపంచంలో అతిపెద్ద ఎలివేటెడ్ మెట్రో నెట్‌వర్క్‌ను పిపీపీ నమూనాలో నిర్మించాలనే మా ప్రయత్నాలకు ఈ అవార్డు ఓ నిదర్శనం, మా సేవలు, నిర్వహణ సమర్దతతో మేము స్దిరంగా అత్యున్నత ప్రమాణాలను సృష్టిస్తూనే ఉన్నాం. ఇప్పుడు దేశంలో ఆధారపడతగిన నగర రవాణా మాధ్యమంగా ఇది నిలిచింది” అని రెడ్డి పేర్కొన్నారు.
ఇన్ఫ్రా సదస్సులో మెట్రోరైల్ ఏబిలియన్ డాలర్ అపర్టునిటీ అనే అంశంపై కెవీబీ రెడ్డి వివరిస్తూ ప్రజల ప్రయాణ సమస్యలను మెట్రో పొగొట్టిందని తెలిపారు. అందుబాటు ధరలనేవి మెట్రో వ్యవస్దలో అత్యున్నత ప్రాధాన్యతాంశంగా ఎప్పుడు నిలుస్తుంటాయని చెప్పారు.