ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, ఢిల్లీ నుండి 150 మందికి పైగా సీనియర్ బిజెపి నాయకులు పార్టీ విజయం కోసం రెండు రాష్ట్రాలలో పర్యటించారు.
పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని 44 అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారం, బూత్ నిర్వహణ సమన్వయం చేయడానికి, క్రమబద్ధీకరించడానికి 100 మందికి పైగా సీనియర్ నాయకులు, కార్యకర్తలను జిల్లా ఇన్‌ఛార్జ్‌లుగా పనిచేయడానికి నియమించిన్నట్లు బిజెపి వర్గాలు తెలిపారు.
జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్న బిజెపి నాయకుల బృందాన్ని ఢిల్లీ బిజెపి మాజీ అధ్యక్షుడు విజయేందర్ గుప్తా, ప్రస్తుత ప్రధాన కార్యదర్శి దినేష్ ప్రతాప్ సింగ్ పర్యవేక్షిస్తున్నారు.
“పార్టీ ఎన్నికలలో పోరాడుతున్న చోట సహాయం చేయడానికి వివిధ రాష్ట్రాల నుండి నాయకులను పంపడానికి ఇది సాధారణ కసరత్తు. ఢిల్లీ ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌కు సమీపంలో ఉండటం వల్ల అక్కడ పనిచేసే మా నాయకులు క్షేత్రస్థాయిలో కొంత ప్రభావం చూపుతారు” అని ఢిల్లీ బిజెపి సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు.
ఢిల్లీ నేతల బృందం తొమ్మిది జిల్లాల్లోని ఈ 44 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం 50 రోజుల పాటు పార్టీ సంస్థాగత, బూత్ నిర్వహణ వ్యూహాలను బలోపేతం చేయడంలో స్థానిక నాయకులతో కలిసి పనిచేస్తుందని ఆయన చెప్పారు.
ఉత్తరప్రదేశ్‌లో గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 44 సీట్లలో 32 స్థానాలను బీజేపీ గెలుచుకుందని, వాటిని నిలబెట్టుకోవడమే కాకుండా ఆ సంఖ్యను పెంచుకోవడమే తమ లక్ష్యం అని ఆయన స్పష్టం చేశారు.
ఢిల్లీ బీజేపీ ఉపాధ్యక్షులు వీరేంద్ర సచ్‌దేవా, అశోక్ గోయెల్ దేవ్రాహా, సునీల్ యాదవ్, అధికార ప్రతినిధులు విక్రమ్ బిధూరి, ఆదిత్య ఝా, మోహన్ లాల్ గోహరా, బ్రజేష్ రాయ్, మాజీ మేయర్ జై ప్రకాష్ జేపీ ఉత్తరప్రదేశ్‌కు పంపినవారిలో ఉన్నారు.
ఉత్తరాఖండ్‌లోని 20 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికల ప్రచారం కోసం 60 మంది ఢిల్లీ బీజేపీ నేతలను స్థానిక నేతలతో సమన్వయం చేసేందుకు మోహరించారు. పార్టీ సీనియర్ నాయకులు రాజేష్ భాటియా, యోగేందర్ చందోలియా ఇన్ఛార్జ్, కో-ఇంఛార్జిగా ఉంటారు.
“మేము ఇప్పటికే మా నిర్దేశిత జిల్లాలు, అసెంబ్లీ స్థానాల్లో ఉన్నాము. సమన్వయం, వ్యూహాల అమలు ద్వారా స్థానిక పార్టీ పునాదిని విస్తరించడానికి, పెంచడానికి సూచనల ప్రకారం పని చేస్తున్నాము” అని ఈ రాష్ట్రానికి వెళ్లిన ఢిల్లీ బిజెపి నాయకుడు ఒకరు చెప్పారు. ఎన్నికలు ప్రకటించిన తర్వాత ఢిల్లీ నేతల ప్రమేయం మరింత వేగవంతమవుతుందని ఆయన చెప్పారు.
Trending
- కూతుళ్లతో కలిసి తిరుమలకు పవన్
- ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల దాడి
- మహాత్ముడికి నివాళులర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ
- 14 రాష్ట్రాలకు రూ. 5858.60 కోట్లు కేంద్రం వరద సాయం విడుదల
- భవనాల కూల్చివేతపై మార్గదర్శకాలు జారీ చేస్తాం
- ఒక తమ్ముడిగా కొండా సురేఖకు అండగా ఉంటా.. బీజేపీ ఎంపీ
- హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం
- నటుడు గోవిందాకు బుల్లెట్ గాయం