మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై టీఆర్ఎస్ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. వేల కోట్ల ప్రాజెక్టు తీసుకొని బీజేపీలో చేరానని చెప్పిన ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌ను ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఎన్నికల అధికారిని కలిసిన వారిలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే గాదరి కిషోర్, పార్టీ జనరల్ సెక్రటరీలు శ్రీనివాస్‌రెడ్డి, సోమ భరత్ ఉన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
మునుగోడులో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్టి తాను రూ.18 వేల కోట్ల ప్రాజెక్టు తీసుకొని బీజేపీలో చేరానని ఓ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారని. అందుకని రాజగోపాల్ రెడ్డిని అసెంబ్లీ బైపోల్లో పోటీ చేయకుండా అనర్హుడిని చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి మెమోరాండం సమర్పించారు.
రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటూనే బీజేపీ ప్రభుత్వం నుంచి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు తీసుకున్నట్టు ఓ టీవీ చానల్లో స్వయంగా చెప్పారని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అవహేళన చేసే చర్య అని, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్‌ను గాలికి వదిలేశారని విమర్శించారు. ఇచ్చి పుచ్చుకోవడం కింద ఇలాంటి పనులు చేసారని ఎన్నికల ప్రధాన అధికారికి విన్నవించామని చెప్పారు.