ఉపఎన్నిక జరుగుతున్న సమయంలో మునుఁగొండ నియోజకవర్గంలో ఒకేసారి 25,000 కోట్ల ఓటర్లను చేర్పించడం పట్ల బిజెపి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. ఇవ్వన్నీ అధికార పార్టీ టిఆర్ఎస్ చేర్పించిన నకిలీ ఓట్లే అని ఆరోపిస్తున్నది. సాధారణంగా ఉపఎన్నిక సందర్భంగా ఏదైనా నియోజకవర్గంలో 2,000కు మించి కొత్త ఓట్లు చేర్చిన సందర్భం లేదని అంటూ, ఈ ఓట్లను తొలగించాలని డిమాండ్ చేస్తున్నది.
ఈ విషయమై ఒక వంక పార్టీ అధికార ప్రతినిధి, న్యాయవాది రచనా రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, బీజేపీ ప్రతినిధి వర్గం కేంద్ర మంత్రి మురళీధర్, ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్, మాజీ ఎమ్యెల్సీ ఎన్ రామచంద్రరావులతో కలసి ఢిల్లీలో ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేసింది.
ఓటర్ల జాబితా పిటిషన్పై హైకోర్టులో పిటిషన్ తరపున న్యాయవాది రచనా రెడ్డి గురువారం వాదనలు వినిపించారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా ఓటర్ల నమోదు జరిగిందని, ఫార్మ్ 6 ప్రకారం కొత్తగా దాదాపు 25 వేల ఓట్లు నమోదు చేసుకున్నారని కోర్టుకు ఆమె తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలోని వివిధ మండలాలలో భారీగా ఓటర్ల నమోదు ప్రక్రియ జరిగిందని పేర్కొన్నారు.
ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు అయ్యిందని, నవంబర్ 3 న ఉప ఎన్నికలు జరగనున్నాయని ఆమె తెలిపారు. ఉపఎన్నికల నేపథ్యంలో భారీగా ఓటర్ల నమోదు అక్రమంగా జరిగిందని రచనా రెడ్డి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ఎన్నికల సంఘం తరపున న్యాయవాది అవినాశ్ దేశాయ్వా దనలు వినిపిస్తూ తుది ఓటర్ల లిస్ట్ ఇంకా ఎన్నికల కమిషన్ ప్రకటించలేదని తెలిపారు. ప్రతి సంవత్సరం కొత్త ఓటర్లు నమోదు చేసుకుంటున్నారని, జనవరి 2021 వరకు రెండు లక్షల 22 వేలు ఓట్లు ఉన్నాయని, ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గంలో 2 లక్షల 38 వేలు ఓట్లు ఉన్నాయని వెల్లడించారు.
ఓటర్ల నమోదు ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని న్యాయవాది అవినాశ్ స్పష్టం చేశారు. కాగా ఇరువురి వాదనలు విన్న హైకోర్టు మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా నమోదు అయినా ఓటర్ల జాబితా నివేదికను సమర్పించాలని ఎన్నికల సంఘానికి ఆదేశిస్తూ తదుపరి విచారణను శుక్రవారంకు వాయిదా వేసింది.
కాగా, ఓటమి భయంతో అక్రమాలకు పాల్పడుతున్న టీఆర్ఎస్పై చర్యలు చేపట్టాలని ఈసీని కోరామని తరుణ్ ఛుగ్ తెలిపారు. ఎలక్షన్ కమిషన్ అనుమతి లేకుండా అక్కడికి వెళ్తున్న అధికారులను బదిలీ చేయాలని కోరామని, నాలుగేళ్లుగా మునుగోడు నియోజకవర్గంలో పనిచేస్తున్న అధికారిని బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు.