మహిళల టీ20 ఆసియాకప్‌ను ఇండియా కైవసం చేసుకున్నది. ఆసియాకప్ ఫైనల్లో ఇండియా 8 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఈజీ విజయాన్ని నమోదు చేసింది. 66 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. కేవలం 8.3 ఓవర్లలోనే ఆ టార్గెట్‌ను చేధించింది.
స్మృతి మందానా సూపర్ హిట్టింగ్తో లక్ష్యం మరీ ఈజీ అయ్యింది. మందానా అజేయంగా 51 రన్స్ చేసింది. ఇండియా మహిళల జట్టు ఆసియాకప్‌ను గెలవడం ఇది ఏడోసారి కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో కేవలం 9 వికెట్లకు 65 పరుగులు మాత్రమే చేసింది.
ఇండియన్ బౌలర్ రేణుకా సింగ్ థాకూర్ తన బౌలింగ్‌తో లంక బ్యాటర్లను ఇబ్బంది పెట్టింది. ఆమె మూడు ఓవర్లలో 5 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నది. రాజేశ్వరి గైక్వాడ్, స్నేహ రాణాలు చెరో రెండేసి వికెట్లు తీసుకున్నారు. ఆరంభం నుంచి భారత బౌలర్లు లంక బ్యాటర్లను కట్టడి చేశారు.
భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో శ్రీలంక వరుస విరామంలో వికెట్లు కోల్పోయారు. శ్రీలంక బ్యాటర్లలో కెప్టెన్ చమరి ఆటపట్టు (6), అనుష్క సంజీవని (2) , హర్షిత మాధవి(1), నిలాక్షి డి సిల్వా (6), హాసిని పెరీరా (0), కవిష దిల్హారి (1), సుగంధిక కుమారి (6), ఆచిని (6), ఇనోకా రణవీర (18), ఓషాది రణసింగె (13) మాత్రమే చేశారు.
భారత బౌలింగ్‌లో రేణుకా సింగ్ (3/5), రాజేశ్వరి గైక్వాడ్ (2/13), స్నేహ రాణా (2/16) రాణించారు. అనంతరం 66 పరుగల స్వల్ప లక్ష్య చేధనకు దిగిన భారత జట్టు రెండు వికెట్లు కోల్పొయి లక్ష్యన్ని చేరుకుంది. చేధనలో షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్ త్వరగా పెవిలియన్‌కు చేరిన మరో ఓపెనర్ మందన 51, కెప్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి లక్ష్యాన్ని చేదించింది.