ప్రముఖ టెలికాం సంస్థ జియో మరో రెండు నగరాల్లో 5జీ ట్రయల్ సేవలను ప్రారంభించింది. రాజ స్థాన్లోని సథాద్వారాతో పాటు, చెన్నయ్‌లోనూ 5జీ సేవలను శనివారం నుంచి ప్రారంభిస్తున్నట్లు జియో ఛైర్మన్ అకాష్ అంబానీ తెలిపారు. దేశంలోనే 5జీ వైఫై సేవలను మొదటిసారిగా నథాద్వారా నుంచి ఆకాష్ అంబానీ ప్రారంభించారు.
ప్రస్తుతం ఢిల్లి, ముంబై, కోల్‌కతా, వారణాశిలో 5జీ బీటా ట్రయల్స్‌ను జియో నిర్వహిస్తోంది. తాజాగా చెన్నయ్, నథాద్వారాలోనూ ఈ సేవలను ప్రారంభించారు. త్వరలోనే దేశమంతా 5జీ సేవలు ప్రారంభిస్తామని అకాష్ అంబానీ తెలిపారు. రిలయన్స్ జియో ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న తరువాత ఆయన తొలిసారిగా 5జీ సేవల గురించి మాట్లాడారు.
రాజస్థాన్‌లోని నథాత్వారా లోని శ్రీనాథ్ జీ అలయాన్ని ముఖేష్ అంబానీ తరచుగా సందర్శిస్తుంటారు. గత నెలలో ఈ అలయాన్ని సందర్శించిన సందర్భంగా త్వరలోనే ఇక్కడ 5జీ సేవలు ప్రారంభిస్తామని ముఖేష్ అంబానీ చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే ఇప్పుడు ఆయన తనయుడు ఆకాష్ అంబానీ ఈ సేవలను ప్ర్ారంభించారు.
జియో తన 5జీ నెట్‌వర్క్‌ను డిసెంబర్ 2023 నాటికి దేశవ్యాప్తంగా ప్రతి పట్టణం, తహసీల్, తాలూకాకు విస్తరించాలని భావిస్తున్నట్లు రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ఆగస్టు 29న భారతదేశంలో 5జీ లాంచ్ సందర్భంగా వెల్లడించారు.ఈ నెల ప్రారంభంలో దేశ రాజధానితోపాటు ముంబై, కోల్‌కతా,వారణాసి వంటి మూడు ఇతర నగరాల్లో 5జీ సేవల బీటా ట్రయల్స్‌ను ప్రారంభించింది. యూజర్లు 1 జీబీపీఎస్ కంటే ఎక్కువ డౌన్లోడ్ స్పీడ్‌ని పొందుతున్నారని జియో తెలిపింది.