అయోధ్యలో రామమందిరంలో రామ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం 2024 జనవరి నుంచి ప్రజా సందర్శనకు అనుమతించడం జరుగుతుందని శ్రీరామ జన్మభూమి తీర్ధ్ క్షేత్ర సభ్యుడు, ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ఆలయ నిర్మాణ పనులు 50 శాతం పూర్తయ్యాయని, ఆలయ నిర్మాణ ప్రక్రియ సంతృప్తికరంగా జరుగుతోందని చెప్పారు.
మకర సంక్రాంతికి మందిరంలోని గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహాలను ప్రతిష్టించనున్నట్టు చంపత్ రాయ్ చెప్పారు. వచ్చే ఏడాది డిసెంబర్ కల్లా ఆలయం గ్రౌండ్ ఫ్లోర్ సిద్ధమవుతుందని, 2024 జనవరి 14 నాటికి రామ్‌లల్లా విగ్రహాల ప్రతిష్ఠాపన జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రామాలయ నిర్మాణానికి రూ.1,8000 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేసినట్టు తెలిపారు.
మందిరం మొదటి అంతస్థులో శ్రీ రాముని దేవాలయం ఉంటుంది. మందిరానికి 12 గేట్లు ఉంటె, ప్రధాన ద్వారానికి `సింగ్ ద్వార్’ అని పేరు పెడుతున్నారు. ప్రహరీ గోడ నిర్మాణం కూడా ప్రారంభిస్తున్నారు. మొత్తం 400 స్తంభాలు దేవాలయంకు ఉంటాయి. భూకంపాలకు తగ్గుకొనే సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. 2.7 ఎకరాల స్థలంలో రామమందిర నిర్మాణం జరుగుతున్నది.