ఈడీ విచారణకు ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ హాజరయ్యారు. పనామా పేపర్స్ లీక్ కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపడంతో సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఈడీ కార్యాలయ్యానికి ఐశ్వర్య రావ్ వెళ్లింది.
ఫెమా చట్టం ఉల్లంఘించినట్లు ఐశ్వర్యా రాయ్ పై ఆరోపణలు వచ్చాయి. పనామా పేపర్ లీక్ కేసులో ఇండియాలో పలువురు రాజకీయ నాయకులు, నటులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు తదితరులతో కలిపి మొత్తం 500 మందికి ప్రమేయం ఉన్నట్లు ఇటీవల వెలుగులోకి వచ్చింది. వీరంతా ప్రభుత్వానికి పన్నులు ఎగవేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఈ కేసులో ఇప్పటికే ఐశ్వర్య రాయ్ భర్త అభిషేక్ బచ్చన్ ఈడీ విచారించి.. ఆయన నుంచి కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఈ కేసులో విచారించేందుకు సమన్లు జారీ చేయగా.. తనకు మరింత సమయం కావాలని రెండు సార్లు కోరినట్లు తెలుస్తోంది.
గత నెల ఐశ్వరాయ్ భర్త అభిషేక్ బచ్చన్ కూడా ఈ కేసులో ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆయన నుంచి కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఐశ్వర్యారాయ్‌ను విచారణకు పిలిచిన ఈడీ త్వరలో అమితాబ్ బచ్చన్‌కు కూడా సమన్లు పంపే అవకాశం ఉన్నది. 2016లో యూకేలో పనామా బేస్డ్ లా సంస్థకు చెందిన 11.5 కోట్ల ట్యాక్స్ డాక్యుమెంట్లు లీకయ్యాయి.