తన బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు పలు కొత్త మలుపులు తీసుకొంటూ ఉండడంతో ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర అసహనంకు గురవుతున్నట్లు చెబుతున్నారు. తనకు సన్నిహితుడైన, మరో బాబాయి కుమారుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంభం పాత్రపై ఈ కేసుపై దర్యాప్తు జరుపుతున్న సిబిఐ అనుమానిస్తుండగా, సొంత సోదరి వై ఎస్ షర్మిల ఢిల్లీ వెళ్లి సిబిఐ ముందు అవినాష్ రెడ్డిపై అనుమానం మరింతగా బలపడే విధంగా వాంగ్మూలం ఇచ్చి రావడంతో తీవ్ర ఆగ్రవేశాలకు గురవుతున్నట్లు తెలుస్తున్నది.
గత నెలలో రెండు సార్లు ఢిల్లీ వెళ్లి ఈ విషయమై సిబిఐ అధికారులను షర్మిల ఈ కేసు విషయమై కలసి వచ్చిన్నట్లు ఇప్పుడు వెలుగులోకి రావడంతో జగన్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నట్లు చెబుతున్నారు. దీనిపై తల్లి విజయమ్మకు ఫోన్ చేసి ఇప్పటి దాకా ఓపికతో ఉన్నానని.. షర్మిల తన పరువును బజారుకు ఈడుస్తోందని ఆవేదన వ్యక్తం చేసిన్నట్లు తెలిసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతిపై ఫిర్యాదు చేయడం కోసం ఢిల్లీ వెళ్లిన్నట్లు విశేషంగా ప్రచారం జరిగినా షర్మిల వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిసింది. సీబీఐ వర్గాల కథనం ప్రకారం వివేకా హత్య కేసులో తనకు తెలిసిన సమాచారం ఇవ్వాలంటూ వైఎస్ షర్మిలను కోరారు. వాంగ్మూలం ఇవ్వాలంటూ నోటీసు కూడా ఇచ్చారు.
తాను తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నానని, వీలు చూసుకుని వస్తానని షర్మిల సమాధానం ఇచ్చారు. వాంగ్మూలాన్ని కడపకు వచ్చే ఇవ్వాలని ఆమె అడగ్గా కడప లేదా ఢిల్లీలోని తమ కార్యాలయంలోనైనా ఇవ్వొచ్చునని సీబీఐ అధికారులు తెలిపారు. గానితో గత నెల 7న ఆమె ఢిల్లీలో సీబీఐ ప్రధాన కార్యాలయానికి వెళ్లి, వివేకా హత్య కేసులో వాంగ్మూలం ఇచ్చారు.
తమకున్న సమాచారం ప్రకారం అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డే వివేకాను చంపించారని ఆమె తన వాంగ్మూలంలో స్పష్టం చేసిన్నట్లు చెబుతున్నారు. దీనికి కారణం ఏమిటని ప్రశ్నించినప్పుడు ‘‘వివేకానంద రెడ్డిని హత్య చేయడానికి ఇతర కారణాలేవీ లేవు. ఆయనకు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. శత్రువులు కూడా లేరు. స్థానికంగా ఆయనను అందరూ గౌరవిస్తారు. వ్యతిరేకించే వారెవరూ లేరు” అంటూ ఆమె పేర్కొన్నారు.
“అయితే… కడప ఎంపీ టికెట్ విషయం లో మా కుటుంబంలో గొడవలు ఉన్నాయి. టికెట్ కోసం మా బాబాయ్ వివేకా గట్టి పోటీదారుగా ఉన్నారు. వైఎస్ అవినాశ్ రెడ్డి కూడా టికెట్ కోసం పోటీ పడుతున్నారు. వివేకా ఎంపీగా పోటీకి దిగితే తమ ఉనికికి ఇబ్బంది అని అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డే ఆయనను చంపించారని మాకున్న సమాచారం’’ అని షర్మిల చెప్పారు.
గత నెల 21వ తేదీన ఆమె మరో మారు ఢిల్లీకి వెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈడీకి ఫిర్యాదు చేశారు. అప్పుడు మీడియాతో కూడా మాట్లాడుతూ బాబాయి వివేక్ హత్యపై అవినాష్ రెడ్డిపై అనుమానం వ్యక్తం చేస్తూ చెప్పారు. ‘‘కడప ఎంపీ టికెట్ తనకు ఇవ్వకపోతే షర్మిలకు లేదా విజయలక్ష్మికి మాత్రమే ఇవ్వాలని వైఎస్ జగన్ను వివేకా కోరారని, ఈ నేపథ్యంలోనే వైఎస్ అవినాశ్ రెడ్డి ఈ హత్య చేయించారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని సీబీఐ పేర్కొంది కదా! దీనిపై మీ స్పందన ఏమిటి?’’ అని మీడియా ప్రశ్నించగా… ‘వాస్తవం’ అని షర్మిల సూటిగా స్పందించారు.
‘‘నా కుటుంబంలో జరిగిన ఘోరమిది సునీతకు న్యాయం జరగాలి. మా చిన్నాన్నను ఎవరు అంత ఘోరంగా హత్య చేశారో వారి పేర్లు బయటికి రావాలి. వారికి శిక్ష పడాలి. దీన్ని ఎవరూ అడ్డుకోడానికి వీల్లేదు’’ అని కూడా పేర్కొన్నారు. సిబిఐ దర్యాప్తు ఎటువంటి మలుపులు తిరిగినా జగన్, షర్మిళ మధ్య ఈ కేసు తీవ్ర అగాధం సృష్టించే పరిస్థితులు మాత్రం వెల్లడి అవుతున్నాయి.
వివేకా హత్య కేసులో షర్మిల సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారని తెలిసి జగన్ అగ్గిమీద గుగ్గిలమైనట్లు తెలిసింది. ఇప్పటికే అన్నా చెల్లెళ్ల మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. వివేకా హత్య సూత్రధారులను జగన్ రక్షిస్తున్నారని బలమైన ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో సీబీఐకి షర్మిల వాంగ్మూలం ఇవ్వడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోయారని తెలిసింది. దీనిపై తల్లికి ఫోన్ చేసి తన ఆగ్రహం వెళ్లగక్కినట్లు సమాచారం. ఇప్పటి దాకా ఓపికతో ఉన్నానని.. షర్మిల తన పరువును బజారుకు ఈడుస్తోందని జగన్ మండిపడినట్లు తెలిసింది.
అవినీతి జరిగిందని సీబీఐకి ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదుపై సీబీఐ స్పం దించి… డీఐజీ స్థాయి అధికారికి ఈ అంశాన్ని అప్పగిస్తున్నట్లు తెలిపిందన్నారు. అయితే… అదేరోజున ఆమె వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిసింది. సీబీఐ వర్గాల కథనం ప్రకారం… వివేకా హత్య కేసులో తనకు తెలిసిన సమాచారం ఇవ్వాలంటూ వైఎస్ షర్మిలను కోరారు. వాంగ్మూలం ఇవ్వాలంటూ నోటీసు కూడా ఇచ్చారు.
తాను తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నానని, వీలు చూసుకుని వస్తానని షర్మిల సమాధానం ఇచ్చారు. వాంగ్మూలాన్ని కడపకు వచ్చే ఇవ్వాలని ఆమె అడగ్గా… కడప లేదా ఢిల్లీలోని తమ కార్యాలయంలోనైనా ఇవ్వొచ్చునని సీబీఐ అధికారులు తెలిపారు. గత నెల 7వ తేదీన ఆమె ఢిల్లీలో సీబీఐ ప్రధాన కార్యాలయానికి వెళ్లి… వివేకా హత్య కేసులో వాంగ్మూలం ఇచ్చారు. తమకున్న సమాచారం ప్రకారం అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డే వివేకాను చంపించారని ఆమె తన వాంగ్మూలంలో తెలిపారు.
దీనికి కారణం ఏమిటని ప్రశ్నించినప్పుడు…‘‘వివేకానంద రెడ్డిని హత్య చేయడానికి ఇతర కారణాలేవీ లేవు. ఆయనకు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. శత్రువులు కూడా లేరు. స్థానికంగా ఆయనను అందరూ గౌరవిస్తారు. వ్యతిరేకించే వారెవరూ లేరు. అయితే… కడప ఎంపీ టికెట్ విషయం లో మా కుటుంబంలో గొడవలు ఉన్నాయి. టికెట్ కోసం మా బాబాయ్ వివేకా గట్టి పోటీదారుగా ఉన్నారు. వైఎస్ అవినాశ్ రెడ్డి కూడా టికెట్ కోసం పోటీ పడుతున్నారు. వివేకా ఎంపీగా పోటీకి దిగితే తమ ఉనికికి ఇబ్బంది అని అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డే ఆయనను చంపించారని మాకున్న సమాచారం’’ అని షర్మిల చెప్పారు.
గత నెల 21వ తేదీన ఆమె మరోమారు ఢిల్లీకి వెళ్లి… కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈడీకి ఫిర్యాదు చేశారు. అప్పుడు మీడియాతో కూడా మాట్లాడారు. ‘‘కడప ఎంపీ టికెట్ తనకు ఇవ్వకపోతే…షర్మిలకు లేదా విజయలక్ష్మికి మాత్రమే ఇవ్వాలని వైఎస్ జగన్ను వివేకా కోరారని… ఈ నేపథ్యంలోనే వైఎస్ అవినాశ్ రెడ్డి ఈ హత్య చేయించారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని సీబీఐ పేర్కొంది కదా! దీనిపై మీ స్పందన ఏమిటి?’’ అని మీడియా ప్రశ్నించగా… ‘వాస్తవం’ అని షర్మిల సూటిగా స్పందించారు.
‘‘నా కుటుంబంలో జరిగిన ఘోరమిది సునీతకు న్యాయం జరగాలి. మా చిన్నాన్నను ఎవరు అంత ఘోరంగా హత్య చేశారో వారి పేర్లు బయటికి రా వాలి. వారికి శిక్ష పడాలి. దీన్ని ఎవరూ అడ్డుకోడానికి వీల్లేదు’’ అని కూడా స్పష్టం చేశారు.