బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ని బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ భార్య ఉషాబాయి కలిశారు. సోమవారం పార్టీ ఆఫీస్ కు వచ్చిన ఆమె తన భర్త ను బయటకు తీసుకొచ్చేందుకు పార్టీ తరఫున సాయం అందించాలని కోరారు. తన భర్తపై పార్టీపరంగా విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. ఉషాబాయి మెదటసారి బీజేపీ కార్యాలయానికి వచ్చారు.
తన భర్త హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతున్నందు వల్లే తెలంగాణ ప్రభుత్వం కక్షపూరితంగా జైల్లో పెట్టిందని ఈ సందర్బంగా ఆమె పేర్కొంది. కాగా, రాజా సింగ్ పై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని కోరుతూ జాతీయ నాయకత్వానికి ఇప్పటికే బండి సంజయ్ లేఖ రాశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రాజాసింగ్‌కు సంబంధించిన కేసుల విషయంతో పాటు పార్టీకి వ్యవహారాల్లో ఎప్పటికప్పుడు లీగల్ టీమ్స్‌తో బండి సంజయ్ మాట్లాడుతున్నారు. రాజాసింగ్ ఇచ్చిన వివరణపై బీజేపీ హైకమాండ్ సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
పార్టీపరంగా రాజాసింగ్ కు న్యాయ సహాయం అందించాలని కూడా నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే రాజాసింగ్ పై సస్పెన్షన్ ను ఎత్తివేయాలనే యోచనలో బీజేపీ జాతీయ నాయకత్వం ఉందని వినికిడి. ఇప్పటికే పార్టీ తరఫున రాజాసింగ్ కు కరుణసాగర్ , రామచంద్రరావులు న్యాయ సహాయం అందిస్తున్నారు.
ఆగస్టు 22వ తేదీన సోషల్ మీడియాలో రాజాసింగ్ ఓ వీడియో అప్లోడ్ చేశారు. ఈ వీడియోలో మహ్మద్ ప్రవక్తను కించపర్చేలా ఉందని ఎంఐఎంతో పాటు ముస్లింలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రాజాసింగ్‌పై బీజేపీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. సెప్టెంబర్ 2లోగా వివరణ ఇవ్వాలని రాజాసింగ్‌ను పార్టీ ఆదేశించింది. బీజేపీ శాసనసభా పక్ష నేత స్థానం నుంచి కూడా పార్టీ ఆయనను తొలగించింది.
ఈ వీడియోలో మహ్మద్ ప్రవక్తను కించపర్చేలా ఉందని ఎంఐఎంతో పాటు ముస్లింలు ఆందోళన వ్యక్తం చేశారు. రాజాసింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో ఆగస్టు 23న ఆయనను అరెస్ట్ చేశారు. అయితే అదే రోజు ఆయనకు నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆగస్టు 25న రాజాసింగ్‌పై పీడీయాక్ట్ నమోదు చేసి మళ్లీ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాజాసింగ్ చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
