బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కు ముంబై ఎయిర్ పోర్ట్ లో చేదు అనుభవం ఎదురైంది. దుబాయ్‌లో ఇటీవల ముగిసిన ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌కి హాజరైన షారూక్ ఖాన్ ఈరోజు ముంబయికి చేరుకున్నారు.
కార్యక్రమాన్ని ముగించుకుని షారూఖ్ ఖాన్ అనంతరం ప్రైవేటు జెట్‌లో ఇండియాకు తిరిగి వచ్చాడు. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు టెర్మినల్ 3దగ్గర ల్యాండ్ అయ్యాడు. టెర్మినల్ నుంచి బయటికి వచ్చేటప్పుడు తనిఖీలు చేపట్టగా బ్యాగేజీలో ఆరు ఖరీదైన వాచ్‌లు బయటపడ్డాయి. ఈ వాచ్‌ల ఖరీదు రూ.18లక్షలు ఉంటుందని సమాచారం.
అతని లగేజీని చెక్ చేసిన కస్టమ్స్ అధికారులు ఆ వాచీలపై ఆరా తీశారు. ఈ క్రమంలో చాలా సేపు షారూక్ ఖాన్ ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండిపోయాడు. చివరికి ఆ రూ.18 లక్షల విలువైన వాచీలకి గానూ రూ.6.83 లక్షలు కస్టమ్స్ డ్యూటీ కట్టిన తర్వాత షారూక్‌ని విమానాశ్రయం వెలుపలికి అధికారులు అనుమతించారు.
ఇలా షారుఖ్ ఖరీదైన వాచ్ లతో దొరకడం ఇది రెండో సారి. 2011లో కూడా ఇలానే విమానాశ్రయంలో కస్టమ్ అధికారులకి షారూక్ దొరికాడు. అప్పట్లో అతను ఏకంగా రూ.1.5 కోట్లని కస్టమ్స్ డ్యూటీ కింద కట్టాల్సి వచ్చింది.