ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆదాయం పెరుగుతున్నప్పటికీ, అది ఆశించిన స్థాయిలో లేదని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి తెలిపారు. ఇదే సమయంలో ఖర్చులు కూడా ఎక్కువ కావడంతో ఆదాయ వ్యయాల మధ్య సమతుల్యత లేకుండా పోతోందని పేర్కొన్నారు.
అయితే, తాము పరిమితికి మించి రుణాలు చేయడం లేదని, తొమ్మిది నెలలకు కేంద్రం ఇచ్చిన పరిమితికి లోబడే ఉన్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అనుమతికి మించి చేసిన రుణాల కారణంగా రూ. 17 వేల కోట్లను ప్రస్తుత పరిమితి నుంచి కేంద్రం కోతలు విధించిందని, అరదుకే ఆ మొత్తాన్ని మళ్లీ ఇవ్వాలనే తాము కేంద్రాన్ని కోరుతున్నామని తెలిపారు.
అంతేగాని, అదనపు రుణం అడగడం లేదని తెలిపారు. ఆ రూ. 17 వేల కోట్ల అరశం 14వ ఆర్ధిక సంఘానికి సంబంధించినదని, తాము ప్రస్తుతం 15వ ఆర్ధిక సంఘం పరిధిలో ఉన్నామని ఆర్ధిక మంత్రి గుర్తు చేశారు. తెలుగుదేశం నేతలు పదేపదే తనను అప్పుల మంత్రిగా అంటున్నారని, అప్పులు చేసేది ఆర్ధిక మంత్రే కానీ హౌంమంత్రి కాదు కదా? అని ప్రశ్నించారు.
గతంలోని ఆర్ధిక మంత్రి యనమల కూడా ఇంతకన్నా ఎక్కువ అప్పులు చేశారని చెబుతూ 15 శాతం అప్పులు చేసిన తాను అప్పుల మంత్రి అయితే, 20 శాతం అప్పులు చేసిన యనమలను పెద్ద అప్పుల మంత్రి అనాలా? అని ప్రశ్నించారు.
రాయలసీమ పర్యటనల్లో చంద్రబాబు చేస్తున్న ప్రసంగాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని బుగ్గన పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలిపిస్తేనే రాజకీయాల్లో ఉంటానని చెప్పడంపై స్పరదిస్తూ 2019లో ఓడించారు కదా అని గుర్తు చేశారు. తమ ప్రభుత్వ పాలనపైనా అన్నీ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.
బడులు మూసేసారని, పిల్లలు చదువు మధ్యలో మానేస్తున్నారని చెప్పడం వాస్తవాలకు దూరమని ధ్వజమెత్తారు. చంద్రబాబు తన హయారలో 34 వేల ఉద్యోగాలు మాత్రమే ఇవ్వగా, తాము ఇప్పటికే 2.10 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, మరో 10 వేల పోస్టులకు నోటిఫికేషన్లు కూడా ఇచ్చామని గుర్తుచేశారు. శ్రీబాగ్ ఒడంబడిక మేరకు కర్నూలులో హైకోర్టు ఉండాలని పెద్దమనుషుల ఒప్పందం జరిగిందని, ఇప్పుడు ఒకే రాజధాని అంటున్న చంద్రబాబుకు ఆ ఒప్పందం ఇష్టం లేదా? అని ప్రశ్నించారు. ఎందుకు అడ్డుడుతున్నారంటూ నిలదీశారు.