సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాష్ట్రంలో ట్రాన్స్జండర్ల భద్రత కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ట్రాన్స్జండర్ ప్రొటెక్షన్ సెల్‌ను ఏర్పాటు చేసింది. మంగళగిరిలోని పోలీస్‌హెడ్ క్వార్టర్స్‌లో సిఐడి చీఫ్ పివి సునీల్‌కుమార్ ట్రాన్స్జండర్లతో కలసి ఈ సెల్‌ను ప్రారంభించారు.
ఈ సందర్బంగా సునీల్‌కుమార్ మాట్లాడుతూ ట్రాన్స్జండర్లకూ ప్రత్యేక హక్కులు, రక్షణ వ్యవస్థ వుండాలని, వారి సంక్షేమం కోసం ప్రత్యేక కార్యమ్రాలను చేపట్టాలని 2019లో సుప్రీంకోర్టు సూచన మేరకు కేంద్రప్రభుత్వం ట్రాన్స్జండర్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను తీసుకువచ్చిందని తెలిపారు.
విద్య, ఉపాధి అవకాశాలల్లోనూ ప్రాధాన్యతను కల్పించాలని చట్టం చెబుతోందని తెలిపారు. ఈసెల్‌కు ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పి కెజివి సరిత నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో ఈ ఈ చట్టంపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ సందర్బంగా ఎస్పి కెజివి సరిత మాట్లాడుతూ ట్రాన్స్‌జండర్లు పోలీస్ స్టేషన్‌కు వస్తే వారిని అగౌరపరిచేలా కాకుండా గౌరవించి సమస్యకు పరిష్కారం చూపాలని సూచించారు.
వికలాంగ, వయోవృద్ధ సంక్షేమశాఖ డైరెక్టర్ ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 28 వేల మంది ట్రాన్స్జండర్లను గుర్తించామని, వారందరికీ నెలకు రూ.3000 చొప్పున పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు. వీరిలో 3800 మంది ఓటు హక్కునూ పొందారని, మిగిలిన వారికి ఓటు హక్కును కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.