న్యూఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ ఫౌండర్స్ (ఎన్డిటివి) ఫౌండర్, ప్రమోటర్ అయిన ప్రణయ్ రాయ్, రాధికారాయ్ లు డైరెక్టర్ల పదవికి రాజీనామా చేశారు. రాయ్ దంపతులకు ప్రస్తుతం 32.26 శాతం వాటాలు ఉన్నట్లు సమాచారం. వీరు రాజీనామా చేసిన వెంటనే అదానీ గ్రూప్‌కి చెందిన సుదీప్త భట్టాచార్య, సంజయ్ పుగాలియా, సెంథిలి సిన్నయ్ చెంగల్వరాయన్‌లను బోర్డు డైరెక్టర్లుగా నియమించింది.
ఈ వారం ప్రారంభంలో వీరు మీడియాను స్వాధీనం చేసుకున్నారు. రాయ్ దంపతుల రాజీనామాలతో పాటు నూతన డైెరెక్టర్ల నియామకాలను మంగళవారం జరిగిన ఓ సమావేశంలో ఆమోదించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఎన్డిటివి మెజార్టీ షేర్లు ఇప్పటికే అదానీ గ్రూప్ దక్కించుకుంది. యాజమాన్యపు హక్కులను కూడా సొంతం చేసుకుంది. దీంతో.. ఎన్డిటివి అదానీ గ్రూప్ సొంతమైంది. ఎన్డిటివి ప్రమోటింగ్ కంపెనీల్లో ఒకటైన ఆర్ఆర్పీఆర్ హౌల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను అదానీ కొనుగోలు చేశారు.
ఎన్డిటివిలో అదానీ గ్రూప్‌నకు 29.18 శాతం ఈక్విటీ వాటాగా లభించింది. అలాగే, బహిరంగ మార్కెట్ ద్వారా ఈ మీడియా సంస్థకు చెందిన మరో 26 శాతం వాటా కోసం ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. నవంబర్ 22న ప్రారంభమైన ఈ ఆఫర్ డిసెంబర్ 5న ముగియనుంది.
మొత్తంగా ఎన్డిటివిలో ప్రస్తుతం అదానీ గ్రూప్ 55.18 శాతం వాటా దక్కించుకుంది. అయితే తమ సమ్మతి లేకుండానే అదానీ గ్రూప్ టేకోవర్ చర్యలు చేపట్టిందని ఎన్డిటివి పేర్కొంటోంది.
అదానీ గ్రూప్ కొనుగోలు చేసిన విశ్వప్రదాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ గతంలో ఎన్డిటివికి రుణం ఇచ్చింది. ఆ రుణాన్నిఎన్డిటివిలో వాటాగా అదానీ గ్రూప్ మార్చుకుంది. దీనికి అదనంగా 26 శాతం వాటాల కొనుగోలు కోసం ఓపెన్ ఆఫర్ ప్రకటించనుంది. దీంతో ఇప్పుడు 34 ఏళ్ల చరిత్ర కలిగిన ఎన్డీటీవీ అదానీ సొంతమైంది. ఎన్డీటీవీ ప్రమోటింగ్ కంపెనీల్లో ఒకటైన ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను అదానీ కొనుగోలు చేశారు.