బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓటమిపాలైంది. ఉత్కంఠ రేకెత్తించిన ఈ పోరులో చివరి బంతికి ఆరు పరుగులు కావల్సిన ఉండగా ముస్తాఫిజుర్ రహ్మాన్ డాట్ బాల్ వేయడంతో బంగ్లా విజయం సాధించింది. భారత బ్యాట్స్ మెన్స్ లో అయ్యర్(82), అక్షర పటేల్(56) రాణించారు.
మిగతా వారు ఘోరంగా విఫలమవ్వగా.. చివర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ(51 నాటౌట్: 28 బంతుల్లో 5సిక్స్‌లు, 3 ఫోర్లు) బ్యాట్ ఝుళిపించినా మ్యాచ్ గెలిపించలేకపోయాడు. నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 9 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. దీంతో టీమిండియాపై బంగ్లా 5 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే బంగ్లాదేశ్ 2-0తో మూడు వన్డేల సిరీస్ కైవసం చేసుకుంది.
చివరి బంతి వరకూ ఉత్కంఠ రేపిన ఢాకా వేదికగా జరిగిన రెండో వన్డేలో 5 పరుగుల తేడాతో బాంగ్లాదేశ్ గెలుపొందింది. గాయం కారణంగా డగౌట్‌కే పరిమితమైన టీమిండియా సారథి రోహిత్ శర్మ చివర్లో బ్యాటింగ్‌కు వచ్చి అద్భుత ఇన్నింగ్స్‌తో ఆశలు రేపినా, చివరి ఓవర్‌కు 20 పరుగులు రావాల్సిన స్థితిలో భారత్‌కు 14 పరుగులే వచ్చాయి.
బంతితో, బ్యాట్‌తో అద్భుతంగా రాణించిన బంగ్లా జట్టు.. అభిమానుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు.. 19 ఓవర్లలో 96 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశ నుంచి అద్భుతంగా పుంజుకొని 50 ఓవర్లలో 271 పరుగులు చేసింది.
తొలి వన్డేలో భారత్‌కు విజయాన్ని దూరం చేసిన మెహిదీ హసన్ మిరాజ్ (100 పరుగులు, 83 బంతుల్లో, 8 ఫోర్లు, 4 సిక్సులు) మరోసారి రాణించి ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. బ్యాట్‌తో, బంతితో (2 వికెట్లు) రాణించిన మిరాజ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
బంగ్లా నిర్దేశించిన 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. ఎబాడట్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ 5 (6 బంతుల్లో, 1 ఫోర్) పరుగులకే ఔటయ్యాడు. బంతి ఎడ్జ్ తీసుకొని వికెట్లను గిరాటేసింది. ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్ (8 పరుగులు, 10 బంతుల్లో, 1 ఫోర్) మెహిదీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.