జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సరికొత్త ప్రచార రథంతో ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. ఎలక్షన్ ప్రచారం కోసం ప్రత్యేకంగా వాహనాన్ని తయారు చేయించారు. ఈ ప్రచార రథానికి ‘వారాహి’ అని పేరు పెట్టారు. ఆర్మీ వాహనానికి అత్యాధునిక మెరుగులు దిద్ది తయారు చేసినట్లుగా వారాహి వాహనం ఉంది. చూపరులను ఇట్టే ఆకట్టుకుంటోంది.
సంప్రదాయ రాజకీయ నేతలెవరికీ లేనివిధంగా ఈ వాహనాన్ని సరికొత్తగా తయారు చేయించారు పవన్ కళ్యాణ్. తన సెక్యూరిటీ టీమ్‌లో ఇటీవల కొత్తగా రిక్రూట్ చేసుకున్న 10 మంది భద్రతా సిబ్బంది పర్యవేక్షణ మధ్య దూసుకొస్తున్న వారాహి వాహనం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘వారాహి’ – రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్ అంటూ ఈ వాహనానికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు పవన్ కళ్యాణ్. ఈ వాహనాన్ని, ట్రయల్ రన్‌ను బుధవారం హైదరాబాద్‌లోకి సంబంధించి కొన్ని ముఖ్య సూచనలను చేశారు. వాహనాన్ని రూపొదిస్తున్న సాంకేతిక నిపుణులతోనూ చర్చించారు.
’వారాహి’ వాహనాన్ని ప్రత్యేక భద్రతా చర్యలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దారు. వాహనంపై ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లు చేశారు. ఆధునిక సౌండ్ సిస్టం వినియోగించారు. నలువైపులా సిసి కెమెరాలు అమర్చారు. జగిత్యాల జిల్లా కొండగట్టులోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రచార వాహనానికి ప్రత్యేక పూజలు చేయించాలని పవన్ నిర్ణయించారని జనసేన నాయకులు వెల్లడించారు.