అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో చైనా సైనికులతో జరిగిన ఘర్షణ గురించి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈరోజు లోక్‌సభలో ప్రకటన చేశారు. ఆ ఘర్షణలో ఒక్క సైనికుడు కూడా మృతి చెందలేదని, ఒక్కరు కూడా తీవ్రంగా గాయపడలేదని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.
డిసెంబర్ 9వ తేదీన తవాంగ్ సెక్టర్లోని యాంగ్జి ప్రాంతంలో చైనా దళాలు భారత భూభాగంలోకి ప్రవేశించాయని, ఆ దళాలు ఆక్రమణకు పాల్పడినట్లు రాజ్‌నాథ్ తెలిపారు. చైనా దళాలు చేసిన ప్రయత్నాల్ని మన సైనికులు సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు ఆయన చెప్పారు.
భూభాగాన్ని ఆక్రమించకుండా పీఎల్ఏను మన సైనికులు ధైర్యంగా అడ్డుకున్నట్లు మంత్రి తెలిపారు. చైనా సైనికులను విజయవంతంగా తమ పోస్టు నుంచి వెళ్లగొట్టారని పేర్కొన్నారు. చైనా ప్రభుత్వంతో ఈ అంశం గురించి దౌత్యపరమైన పద్ధతిలో చర్చించినట్లు మంత్రి వెల్లడించారు.
సరిహద్దుల్ని రక్షించేందుకు మన దళాలు కట్టుబడి ఉన్నాయని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. ఎవరైనా మన భూభాగంలోకి ప్రవేశించాలని చూస్తూ వాళ్లను సమర్థవంతంగా అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. పీఎల్ఏతో జరిగిన ఘర్షణలో ఇరు వైపులకు చెందిన దళాలకు స్వల్ప గాయాలైనట్లు రాజ్‌నాథ్ తెలిపారు.
మన సైనికుల్లో ఒక్కరు కూడా చనిపోలేదని, తీవ్రంగా గాయపడలేదని పేర్కొన్నారు. భారతీయ మిలిటరీ కమాండర్లు సరైన సమయంలో జోక్యం చేసుకోవడం వల్ల… పీఎల్ఏ దళాలు వెనక్కి వెళ్లినట్లు మంత్రి చెప్పారు.
కాగా సరిహద్దు వద్ద యుద్ధ విమానాలతో భారత్ పెట్రోలింగ్ నిర్వహిస్తోంది. చైనా ఉల్లంఘనలను అడ్డుకునేందుకు గత కొన్ని రోజుల నుంచి భారత వైమానిక దళాలు పెట్రోలింగ్ చేపడుతున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. అరుణాచల్‌లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద జోరుగా పెట్రోలింగ్ జరుగుతున్నట్లు తెలిపారు.