బాలీవుడ్ హీరో షారూక్‌ఖాన్‌తో కలిసి అగ్రశ్రేణి నటి దీపికా పడుకోనే నటిస్తోన్న పఠాన్ సినిమాలోని ఓ పాట యాడ్ విడుదలైన దశలో ఇందులో దీపిక భంగిమపై వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఆమె వస్త్రధారణ అసభ్యంగా ఉండడమే కాకుండా, అస్లీల భంగిమలో ఆమె కాషాయ బికినీలు ధరించడంతో నెటిజన్లు ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారు.
దానితో, దుస్తులు సరిచేసుకోండి లేకపోతే మధ్యప్రదేశ్‌లో మీ సినిమా నడవదని దీపికాను మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా హెచ్చరికలు వెలువరించారు. ఈ సినిమాపై మధ్యప్రదేశ్ మంత్రి రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి హోదాలో మిశ్రా ఘాటుగా స్పందించారు.
చాలా కాలం గ్యాప్ తర్వాత హీరో షారూక్ సినిమా పఠాన్ భారీ అంచనాల నడుమ జనవరి 25న విడుదల కానుంది. ఈ దశలో సినిమా ప్రచారంలో భాగంగా ఇటీవలే ఇందులోని బేషరమ్ రంగ్ పాట సన్నివేశాలు విడుదల అయ్యాయి. ఇందులో దీపిక బికినీ డ్రస్సు , బీచ్‌లో ఈ పాట చిత్రీకరణ దృశ్యాలపై హోం మంత్రి స్పందించారు.
ఇటువంటి దృశ్యాలను వెంటనే సరిదిద్దుకోవల్సి ఉంటుంది. లేకపోతే ఈ సినిమా ప్రదర్శన సంబంధిత విషయంపై తాము నిర్ణయం తీసుకుంటామని బిజెపి పాలిత మధ్యప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి ప్రకటించారు. దీపిక దేశంలోని తుక్డే తుక్డే గ్యాంగ్ మద్దతుదారు అని, ఈ విషయం జెఎన్ఎ కేసులో స్పష్టం అయిందని మంత్రి ఆరోపించారు.
హీరోయిన్ వేసుకున్న బికినీ చాలా అభ్యంతరకరంగా ఉంది, ఈ పాట చిత్రీకరణ పూర్తిగా మలినమైన ఆలోచనలు మైండ్‌తో తీసినట్లు ఉందని మంత్రి విమర్శించారు. ఇటువంటి రెచ్చగొట్టే, చెడగొట్టే వైఖరిని మధ్యప్రదేశ్‌లోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు.
బురదపట్టినట్లున్న బుర్రల వారి వైఖరి ఇది అని హోంమంత్రి మండిపడ్డారు. ముందు హీరోయిన్ దుస్తులు సవరించి తరువాత పాట చిత్రీకరించండి లేకపోతే సినిమా విడుదల అవుతుందా? లేదా అనేది ఆలోచించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.