వైసిపి, టిడిపి శ్రేణులు ఘర్షణకు దిగడంతో పల్నాడు జిల్లా మాచర్ల భగ్గుమన్నది.టీడీపీ ఇంచార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి చేపట్టిన ఇదేం కర్మ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ వార్డులో ఇంటింటికి తిరుగుతున్న సమయంలో టీడీపీ శ్రేణులపై రాళ్లు, కర్రలతో వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు.
ఈ దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. టీడీపీ శ్రేణులు సైతం తీవ్రంగా ప్రతిఘటించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ దాడుల్లో పలువురు టీడీపీ, వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.
మరింత రెచ్చిపోయి, వైసిపి కార్యకర్తలు టిడిపి నియోజకవర్గ ఇన్ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటితోపాటు ఆఫీసుకు, నాయకుల వాహనాలకు నిప్పు పెట్టారు. టిడిపికి చెందిన మరో ఇద్దరు నాయకుల ఇళ్లను కూడా దగ్ధం చేశారు. ఏం జరుగుతుందో అర్ధం కాని స్థితిలో పట్టణ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు 144వ సెక్షన్ విధించారు.
మాచర్లలో హింసాత్మక ఘటనలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాచర్లలో టిడిపి శ్రేణులపై వైసిపి గూండాల దాడులు, పార్టీ నేతల ఇళ్లు, పార్టీ కార్యాలయాలకు నిప్పు పెట్టిన ఘటనల పట్ల ఆగ్రహం వాయ్కతం చేస్తూ అధికార పార్టీ రౌడీయిజానికి పోలీసులు కొమ్ము కాయడం ఇంకా దారుణం ఆవేదన వ్యక్తం చేశారు.
గుంటూరు డిఐజికి ఆయన ఫోన్ చేసి పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే పోలీసులు ఎందుకు స్పందించలేదని ప్రశిుంచారు. వైసిపి గూండాలకు పోలీసులు కుమ్ముకాయడం దారుణమని, వారికి సహకరించిన పోలీస్ సిబ్బంది, అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.