మన రాజ్యాంగం నైతిక విద్యకు సంబంధించిన డాక్యుమెంట్ వంటిదని భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ శనివారం తెలిపారు. మన సమాజంలో నైతిక ప్రవర్తనను సృష్టించడానికి రూపొందించిన పత్రమని చెప్పారు.
”మన రాజ్యాంగం ప్రజల కోసం ఉద్దేశించలేదు. ప్రజలు ఎలా వుండాలో చెప్పేందుకు నిర్దేశించివుంది. ప్రాథమిక హక్కులకు రాజ్యాంగమే దిక్సూచి. దైనందిన జీవితానికి మార్గదర్శి” అని ఆయన పేర్కొన్నారు. మాజీ అటార్నీ జనరల్ అశోక్ దేశారు 90వ జయంతి సందర్భంగా ముంబయిలో ఆయన సార్మకోపన్యాసం చేశారు.
”మేం అన్యాయాన్ని సరిదిద్దాం. సెక్షన్ 377 అనేది గత శకంలోని నైతికతపై ఆధారపడింది. రాజ్యాంగ నైతికత వ్యక్తుల హక్కులపై కేంద్రీకరిస్తుంది. సమాజంలో ఆదరణ పొందిన నైతిక భావనల నుండి దానిని రక్షిస్తుంది.” అని ఆయన తెలిపారు.
”ప్రగతిశీల రాజ్యాంగం విలువలనేవి మనకి ఒక మార్గనిర్దేశక శక్తిగా పనిచేస్తాయి. మన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలు రాజ్యాంగం నుండి దూరంగా మళ్లరాదని అవి చెబుతాయి.” అని జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు. తమ వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడుకునేందుకు ప్రజలకు న్యాయ స్థానాల్లో నమ్మకముండాలని స్పష్టం చేశారు.
చట్టం, నైతికతల మధ్య తేడా అనేది అస్పష్టం ని చెబుతూ చట్టం, నైతికత అనేవి అనుసంథానమై వుంటాయని న్యాయ నిపుణులు పేర్కొంటారని చంద్రచూడ్ తెలిపారు. బలహీన వర్గాలపై పెత్తనం చెలాయించగల బలమైన వర్గాల వారు అసలు నైతికత లేదా ప్రవర్తనా నియమావళి ఇలా వుండాలి అని ఎవరు నిర్ణయిస్తారు? అని ప్రశ్నించారు.