భారత్‌లో ప్రస్తుతమున్నకరోనా పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు అవసరం లేదని, లాక్డౌన్లు విధించాల్సిన పరిస్థితి లేదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రజలు హైబ్రిడ్ ఇమ్యూనిటీని కలిగి ఉండటం వల్ల తీవ్ర కరోనా లక్షణాలు, ఆసుపత్రిలో చేరికలకు అవకాశం ఉండకపోవచ్చని అంచనా వేశారు.
‘మొత్తంగా చూసుకుంటే.. కరోనా కేసుల్లో పెరుగుదల లేదు. ప్రస్తుతం మన పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఈ సమయంలో అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు, లాక్డౌన్లు విధించాల్సిన అవసరం లేదు’ అని ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. ఇన్ఫెక్షన్ వ్యాప్తిని అరికట్టడంలో విమానాలను నిషేధించడం అంత ప్రభావవతంగా లేదని గత అనుభవాలు చూపిస్తున్నాయని పేర్కొన్నారు.
‘ఇంకో విషయం ఏంటంటే.. చైనాలో విజఅంభిస్తోన్న బిఎఫ్.7ను ఇప్పటికే భారత్‌లో గుర్తించారు. ఇంకోపక్క భారత ప్రజలు హైబ్రిడ్ ఇమ్యూనిటీ (వ్యాక్సినేషన్ వైరస్ సోకడంతో వచ్చిన నిరోధకత)ని సొంతం చేసుకోవడంతో తీవ్ర వ్యాధి లక్షణాలు, ఆసుపత్రిలో చేరికలు ఉండకపోవచ్చు’ అని వెల్లడించారు.
అయితే కరోనా కేసులు తక్కువగా ఉండటం వల్ల ఉదాసీనత కనిపిస్తోంది కాబట్టి ఈ సమయంలో కరోనా నియమావళిని బలోపేతం చేయాల్సి ఉందని చెప్పారు. చైనా అమలు చేసిన జీరో కరోనా వ్యూహం వల్ల అక్కడి ప్రజలు సహజ నిరోధకతను పొందలేకపోయారని నిపుణులు వెల్లడించారు. అలాగే చైనా టీకాల తక్కువ ప్రభావశీలత కూడా ప్రస్తుత తీవ్రతకు కారణమని పేర్కొన్నారు.
కాగా, చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయిలాండ్ల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు ఆర్టి-పిసిఆర్ పరీక్ష తప్పనిసరని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శనివారం తెలిపారు. ఈ దేశాల నుండి వచ్చిన ఏ ప్రయాణికులకైనా లక్షణాలు వునుట్లు కనిపించినా లేదాపాజిటివ్ వచ్చినా వారు క్వారంటైన్ అవ్వాలనిమాండవీయ తెలిపారు.
తమ ఆరోగ్య పరిస్థితులను తెలియజేసే ‘ఎయిర్ సువిధ’ ఫారమ్‌ను కూడా పూర్తి చేయాల్సి వుందనాురు. కొత్త వేరియంట్ దేశంలోకి ప్రవేశించే ముప్పును తగ్గించేందుకుశనివారం నుంచి ప్రతి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత్ చేరుకును 2శాతం ప్రయాణికులకుకోవిడ్ పరీక్షలు చేసేలా చూడాలనిపౌర విమానయాన మంత్రిత్వ శాఖను కోరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఆస్పత్రుల్లో ఆక్సిజన్, లైఫ్ సపోర్ట్ పరికరాలు తప్పనిసరిగా అందుబాటులో వుండేలా చూడాల్సిందిగా రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకువైద్య పరంగా మౌలిక సదుపాయాలు, వసతులు అనీు అందుబాటులో వుండేలా చూడడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలనికేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి మనోహర్ అగానీ కోరారు. ఆక్సిజన్ ప్లాంట్లు పూర్తి స్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలనాురు.