అమృత కాలం తాలూకు రాబోయే 25 సంవత్సరాల యాత్రలో వాటర్ విజన్ @ 2047 అనేది ఒక ముఖ్యమైనటువంటి పార్శ్వంగా ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. వీడియో సందేశం మాధ్యం ద్వారా జల సంరక్షణ అంశంపై రాష్ట్రాల మంత్రుల ప్రథమ అఖిల భారతీయ వార్షిక సమ్మేళనాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ నిరంతర అభివృద్ధి, మానవ వికాసం కోసం జల వనరులను వినియోగం లోకి తెచ్చుకొనేందుకు అనుసరించవలసిన మార్గాలను గురించి ముఖ్య విధాన రూపకర్తలకు ఒక వేదికను అందించడం ఈ సమావేశపు ఉద్దేశ్యం అని చెప్పారు.
ప్రధాన మంత్రి ‘సమగ్ర ప్రభుత్వం’’, ‘సంపూర్ణ దేశం’ లకు సంబంధించి తన దృష్టికోణాన్ని పునరుద్ఘాటిస్తూ, ప్రభుత్వాలు అన్నీ కూడాను ఒక వ్యవస్థ లాగా పని చేయాలని పిలుపిచ్చారు. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలలోని విభిన్న మంత్రిత్వ శాఖలు, ఉదాహరణకు జల మంత్రిత్వ శాఖ, సేద్యపు నీటిపారుదల మంత్రిత్వ శాఖ, వ్యవసాయ మంత్రిత్వ శాఖ, గ్రామీణ, పట్టణ అభివృద్ధి, విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖల మధ్య నిరంతరం సంపర్కం, చర్చ లు చోటు చేసుకొంటూ ఉండాలని స్పష్టం చేశారు.
ఈ విభాగాల దగ్గర ఒకదానితో మరొకదానికి సంబంధించిన సమాచారం, డాటా ఉందీ అంటే అప్పుడు ప్రణాళిక రచన లో తోడ్పాటు లభిస్తుందని కూడా ఆయన చెప్పారు. ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా ప్రభుత్వం జవాబుదారితనం తరిగిపోదని పైగా, దీనికి అర్థం కర్తవ్యాన్ని అంతటిని ప్రజలపైనే వేసేయాలని కూడా కాదని ప్రధాన మంత్రి వివరించారు.
ప్రధానమంత్రి స్వచ్ఛ్ భారత్ అభియాన్ ను ఒక ఉదాహరణ గా చెబుతూ, ‘‘ప్రజలు ఎప్పుడైతే స్వచ్ఛ్ భారత్ అభియాన్ లో చేతులు కలిపారో, వారందరిలో ఒక చేతన మేలుకొంది’’ అని పేర్కొన్నారు. జల సంరక్షణ దిశలో ప్రజలు ముందుకు రావాలి అనేటటువంటి ఆలోచనను రేకెత్తించవలసిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొంటూ ఏదైనా ఒక విషయంలో జాగరూకత ఏర్పడింది అంటే దాని ప్రభావం ఎంత గానో ఉంటుందని ఆయన తెలిపారు.
దేశంలో ప్రతి జిల్లాలో 75 అమృత సరోవరాల నిర్మాణం కొనసాగుతున్నదని చెబుతూ దీనిలో భాగంగా, ఇప్పటి వరకు 25 వేల అమృత సరోవరాలు రూపుదాల్చాయని ప్రధాన మంత్రి వెల్లడించారు. సమస్యలను గుర్తించడం, పరిష్కారాలను కనుగొనడం కోసం సాంకేతిక విజ్ఞానాన్ని, పరిశ్రమను, స్టార్ట్-అప్స్ ను సంధానించవలసిన అవసరాన్ని గురించి ఆయనప్రస్తావింఛారు. ఈ పనిలో జియో-సెన్సింగ్, జియో-మేపింగ్ ల వంటి సాంకేతిక లు ఎంతగానో సాయపడగలుగుతాయని ఆయన పేర్కొన్నారు.
ప్రతి కుటుంబానికి నీటి ని సమకూర్చడం కోసం ఒక ప్రపముఖ అభివృద్ధి కొలమానంగా ‘జల్ జీవన్ మిశన్’ సఫలం కావడాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, చాలా రాష్ట్రాలు మంచి పనిని చేశాయిని, మరిన్ని రాష్ట్రాలు ఈ దిశ లో ముందుకు కదులుతున్నాయని కొనియాడారు. ఒకసారి ఈ వ్యవస్థ అమలైందీ అంటే గనక మనం భవిష్యత్తులో ఇదే విధంగా దీనిని నిర్వహించుకొనేటట్లుగా జాగ్రత తీసుకోవాలని ఆయన సూచించారు.
గ్రామ పంచాయతీలు జల్ జీవన్ మిశన్ కు నేతృత్వాన్ని వహించాలని ప్రధాని ప్రతిపాదించారు. పని ముగిసిన తరువాత తగినంతగా స్వచ్ఛమైన జలాన్ని అందుబాటులోకి తీసుకు రావడమైంది అంటూ గ్రామ పంచాయతీ లు ధ్రువ పరచాలని కూడా ఆయన చెప్పారు.