రాజస్థాన్‌కు చెందిన ఐఏఎస్ అధికారి పవన్ అరోరాపై కమిషనర్ పూజామీనా సంచలన ఆరోపణలు చేశారు. పవన్ అరోరా సెక్స్ రాకెట్ నడుపుతున్నారని, తనను వేధింపులకు చేసినట్లు ఆరోపించింది. తీవ్రమైన ఆరోపణలతో రాజస్థాన్‌లో కలకలం సృష్టించాయి. ఐఏఎస్ అధికారి పవన్ అరోరాకు ఓ మంత్రి రక్షణ కల్పిస్తున్నారని కూడా ఆమె చెప్పారు.
అయితే, ఈ ఆరోపణలు నిరాధారమైనవని ఐఏఎస్ అరోరా ఖండించారు. పూజా మీనా రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి. ఆమె ఝాలావర్ జిల్లా మున్సిపల్ కౌన్సిల్ మిషనర్‌గా పని చేస్తున్నారు. ఆమె అక్కడి నుంచి బదిలీ కాగా పోస్టింగ్ ఆర్డర్ కోసం ఎదురుచూస్తున్నారు.
పవన్ అరోరా పట్టణ స్థానిక సంస్థల విభాగం డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం రాజస్థాన్ హౌసింగ్ బోర్డు కమిషనర్‌గా ఉన్నారు. వాస్తవానికి, జనవరి 9న పూజా మీనాను ఝలావర్ మున్సిపల్ కౌన్సిల్ కమిషనర్ నుంచి నాగౌర్ మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేశారు.
ఆతర్వాత ఆర్డర్స్‌ను సవరిస్తూ డైరెక్టరేట్‌కు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. మళ్లీ జనవరి 10న మరో కొత్త బదిలీ ఉత్తర్వులు జారీ కావడంతో జైపూర్ హెరిటేజ్ మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ కమిషనర్‌గా నియామకమయ్యారు.
పూజా మీనా మాట్లాడుతూ ‘ఐఏఎస్ పవన్ అరోరా చాలా చెత్త మనిషి. రాజస్థాన్ ప్రభుత్వంలో అతను అత్యంత వక్రబుద్ధి గల వ్యక్తి. పవన్ అరోరా నన్ను వేధిస్తున్నాడు. డీఎల్బీ డిపార్ట్మెంట్లో ఉన్నప్పటి నుంచి మహిళ బృందాన్ని ఏర్పాటు చేసి డిపార్ట్మెంట్లో సెక్స్‌రాకెట్ నడిపాడు’ అని ఆరోపించారు.
మరో అధికారి హృదేష్ శర్మ, మంత్రి ధరివాల్‌పై సైతం ఆమె ఆరోపణలు చేశారు. పూజామీనా 15 రోజుల కిందట మున్సిపల్ ఝాలవర్ మున్సిపల్ కౌన్సిల్ కమిషనర్‌గా నియామకమయ్యారు. జనవరి 9న రెండు ఆకస్మిక బదిలీ నేపథ్యంలో ప్రస్తుత డీఎల్బీ డైరెక్టర్ హృదేష్ శర్మపై ఆరోపణలు చేశారు.
పూజా మీనా బదిలీకి సంబంధించి ఉత్తర్వులను హృదేస్ శర్మ ఆమోదించారు. ముఖ్యమంత్రి గెహ్లాట్‌కు సన్నితుడైన మంత్రి శాంతి ధరివాల్ పవన్ అరోరాకు రక్షణ కల్పిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
అయితే, పూజా మీనా ఆరోపణలను ఆయన ఖండించారు. ఆరోపణలన్నీ నిరాధారమైనవి, తాను డీఎల్బీలో పోస్ట్ చేసినప్పుడు సదరు మహిళ ఒకటి, రెండుసార్లు పేపర్లతో తన ఛాంబర్‌కి వచ్చేదని, అంతే తప్ప ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు.