భారత్ లో రూ. 2,000 నోట్లకు కాలం చెల్లబోతోంది. తక్షణమే వీటి చెల్లుబాటును నిలిపివేస్తున్నట్లు ప్రకటిస్తూ, ఈ నెల 23 నుంచి ఈ నోట్లను తీసుకునే విధానంలో కొన్ని షరతులు పెట్టబోతున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం ప్రకటించింది. సెప్టెంబర్ 30 వరకు వీటి ఎక్చేంజ్ చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నట్టు తెలుస్తోంది.
కాగా, 2016 నవంబర్ లో ప్రవేశపెట్టిన ఈ నోట్ల ఉత్పత్తిని 2018-19లో పూర్తిగా నిలిపివేశారు. ప్రభుత్వం లీగల్ టెండర్‌గా రూ. 500, రూ. 1,000 ఉపసంహరించుకున్న తర్వాత కరెన్సీ అవసరాలను తీర్చడానికి డినామినేషన్ ప్రవేశపెట్టబడింది. రూ. 2,000 నోట్ల లక్ష్యం “ఇతర డినామినేషన్లలోని నోట్లు తగిన పరిమాణంలో అందుబాటులోకి వచ్చిన తర్వాత నెరవేరాయి” అని ఆర్బీఐ తెలిపింది.
చలామణిలో ఉన్న మొత్తం నోట్లలో దాదాపు 87 శాతం మార్చి 2017కి ముందు జారీ చేశారు. అవి 4-5 సంవత్సరాల జీవితచక్రం ముగింపు దశకు చేరుకుంటున్నాయి. ఇక.. 2018లో గరిష్టంగా రూ.6.73 ట్రిలియన్లుగా ఉన్న రూ.2,000 నోట్ల మొత్తం విలువ మార్చి 31 నాటికి రూ.3.62 లక్షల కోట్లకు తగ్గింది.
ప్రస్తుతం, రూ. 2,000 నోట్లు 2018లో 37.3 శాతం వాటా నుండి మొత్తం చెలామణిలో ఉన్న మొత్తం నోట్లలో కేవలం 10.8 శాతం మాత్రమే ఉన్నాయి. లావాదేవీలలో దాని సాధారణ వినియోగం తగ్గడం, ఆర్థిక వ్యవస్థలోని ఇతర డినామినేషన్లలో తగినంత నోట్ల లభ్యత ఆధారంగా ఈ డినామినేషన్ నోట్లను ఉపసంహరించుకోవాలని ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఆర్బీఐ క్లీన్ నోట్ పాలసీలో భాగంగా ఉపసంహరించుకున్నప్పటికీ, రూ. 2,000 నోట్లు చట్టబద్ధంగా ఉంటాయని సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజాప్రతినిధులు తమ బ్యాంకు ఖాతాల్లో నోట్లను జమ చేసుకోవచ్చు. రూ.2000 నోట్ల మార్పిడిపై రూ.20,000 సీలింగ్ విధించారు.
ఈ నోట్లను మార్చుకోవడానికి గడువు సెప్టెంబర్ 30, 2023. ఆర్బీఐ 10 ప్రాంతీయ కార్యాలయాలు రూ. 2,000 నోట్లను రూ. 20,000 వరకు మార్చుకునే అవకాశాన్ని కూడా అందిస్తాయి. తక్షణం అమలులోకి వచ్చేలా రూ.2000 నోట్లను ఆర్బీఐ నిలిపివేసింది.