క్రికెట్ అభిమానులు ఎప్పుడా అంటూ.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ కప్ షెడ్యూల్ వచ్చేసింది. భారత్‌లో అక్టోబర్-నవంబర్‌లో జరగనున్న ఈ మెగా టోర్నీలో మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. బిసిసిఐ, ఐసిసి మంగళవారం ముంబయిలో ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ 2023 షెడ్యూల్‌ను ప్రకటించాయి.
అక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల తొలి మ్యాచ్ జరగనుంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 15న జరగనుంది. అక్టోబర్ 5న టోర్నీ ప్రారంభమై నవంబర్ 19న ఫైనల్‌తో ముగుస్తుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్, ముంబైలోని వాంఖడే క్రికెట్ గ్రౌండ్లు సెమీస్ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడి క్రికెట్ స్టేడియంలో జరుగనుంది. ప్రపంచంలో ఇదే అతి పెద్ద స్టేడియం. ఆతిథ్య భారత్ తన తొలి మ్యాచ్‌ని అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో చెన్నైలో అక్టోబర్ 8న ఆడనుంది. ఇక టోర్నీలోనే అత్యంత ఆసక్తికరమైన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 15న జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ హైవోల్టేజ్ పోరు జరగనుంది.
భారత్ జట్టు ఆడే పూర్తి మ్యాచ్‌ల షెడ్యూల్ ఇలా ఉంది. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో చెన్నైలో, అక్టోబర్ 11న ఆఫ్ఘనిస్థాన్‌తో ఢిల్లీలో, 15న పాకిస్థాన్‌తో అహ్మదాబాద్‌లో, 19న బంగ్లదేశ్‌తో పుణేలో, 22న న్యూజిలాండ్‌తో ధర్మశాలలో, 29న ఇంగ్లండ్‌తో లక్నోలో, నవంబర్ 2న క్వాలిఫైయర్ జట్టుతో ముంబైలో, 5న సౌతాఫ్రికాతో కోల్‌కతాలో, 11న క్వాలిఫైయర్ జట్టుతో బెంగళూరులో భారత జట్టు తలపడనుంది.