భారతదేశపు మూడో చంద్రుడి మిషన్ చంద్రయాన్-3 విజయవంతంగా సాగిపోతోంది. చందమామపై నిగూఢ రహస్యాలను కనుక్కునేందుకు ఇస్రో ప్రయోగించిన ఈ అంతరిక్ష నౌక భూమి కక్ష్యను వీడి చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. నిన్న అర్ధరాత్రి 12.15 నిమిషాలకు భూకక్ష్యను వీడి చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్ 3 నౌక ప్రవేశిస్తున్న గ్రాఫిక్ పిక్ ను ఇస్రో ట్విట్టర్ లో షేర్ చేసింది.
దీంతో చంద్రయాన్ 3కి మరో కౌంట్ డౌన్ మొదలైంది. భూమి కక్ష్యలో నుంచి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్ 3 నౌక ఈ నెల 5న విజయవంతంగా కక్ష్యలోకి పూర్తిగా ప్రవేశిస్తుంది. అంటే ఈ ఆరు రోజులు కౌంట్ డౌన్ అన్నమాట.
ఈ ఆరు రోజుల తర్వాత చంద్రుడి కక్ష్యలో తిరుగుతూ క్రమంగా తన వ్యాసాన్ని తగ్గించుకుంటూ చివరికి చంద్రుడిని చేరడం చంద్రయాన్ 3 లక్ష్యం. కాబట్టి ఈ దశ మరింత కీలకంగా భావిస్తున్నారు. అర్ధరాత్రి చంద్రయాన్ నౌకను భూకక్ష్యలో నుంచి చంద్రుడి కక్ష్యలోకి ఎలా ప్రవేశపెట్టారో ఇస్రో ట్వీట్ లో వివరించింది.
చంద్రుడిని చేరుకోవడానికి చంద్రయాన్ 3 అంతరిక్ష నౌకను కక్ష్యలో అమర్చడానికి ఉపయోగించే వ్యూహాన్ని ట్రాన్స్ లూనార్ ఇంజక్షన్ గా పేర్కొంటున్నారు. ఇందులో ఇంధనాన్ని అవసరమైనంత మేరకు మండించడం ద్వారా కక్ష్యలో ఇది సాఫీగా పరిభ్రమించేలా చేస్తారు.
సాధారణంగా ఇది రసాయన రాకెట్ ఇంజిన్ ద్వారా చేయబడుతుంది. ఇది వ్యోమనౌక వేగాన్ని పెంచుతుంది. ఇది దాని కక్ష్యను వృత్తాకార తక్కువ-భూమి కక్ష్య నుండి అత్యంత అసాధారణ కక్ష్యగా మారుస్తుంది. ఈ దశ ఇప్పుడు పూర్తయింది.
చంద్రుని సమీపిస్తున్నప్పుడు అంతరిక్ష నౌక అపోజీకి చేరుకునే విధంగా ఇంధనం మండే సమయం సెట్ చేశారు. వ్యోమనౌక చంద్రుని ప్రభావ గోళంలోకి ప్రవేశించిన తర్వాత హైపర్బోలిక్ లూనార్ స్వింగ్బైగా పేర్కొనే విన్యాసం చేస్తుంది. ఇస్రో చంద్రయాన్-3 చంద్రుడిపై ల్యాండింగ్‌ను భారత కాలమానం ప్రకారం ఆగస్టు 23న సాయంత్రం 5:47 గంటలకు ప్లాన్ చేసింది. చంద్రుడిపై ఒక రోజుగా భావించే మన 14 రోజుల కాలం ప్రకారం ఇది సుమారు 80 గంటల్లో చంద్రుడి దక్షిణ ధృవం దగ్గర సురక్షితంగా ల్యాండ్ కావాల్సి ఉంది.