స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు సంబంధించి న్యాయ పోరాటాలు జరుగుతున్నందున ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నాటకం తీవ్రస్థాయిలోనే ఉంది. ఈ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టుకు, విజయవాడ ఏసీబీ కోర్టుకు చేరడంతో తీవ్ర చర్చనీయాంశమైంది.
సుప్రీంకోర్టులో, చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. అక్టోబర్ 3న పునః ప్రారంభం కానుంది. ముందుగా పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు బెంచ్‌లోని తెలుగు న్యాయ మూర్తి జస్టిస్ ఎస్వీఎన్ భట్టి విచారణకు విముఖత చూపించారు. సంజీవ్ ఖన్నా బెంచ్‌లో `నాట్ బిఫోర్ మీ’ అన్నారు జస్టిస్ భట్టి.
దీంతో మరో బెంచ్‌కు పిటిషన్‌ను బదిలీ చేశారు. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. అయితే ఈ విషయాన్ని సీజేఐ ధర్మాసనం ముందుకు తీసుకెళ్లారు చంద్రబాబు న్యాయవాది లూథ్రా. మరో ధర్మాసనం, లేదా సీజేఐ ధర్మాసనం ఇప్పుడే విచారించాలని కోరారు. దీంతో ఈ కేసు విచారణను ధర్మాసనం స్వీకరించింది. రాజకీయ కక్షతోనే వరుస కేసులు పెడుతున్నారని విన్నవించారు.
గవర్నర్ ఆమోదం లేకుండానే అరెస్ట్ చేశారని, కనీసం విచారణ నోటీస్ ఇవ్వకుండానే జైలులో ఉంచారని తెలిపారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్ డెవలప్మెంట్ కేసులో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ లు చెల్లవని లూద్రా తనవాదలను వినించారు.
సిఐడి తరుపు న్యాయవాది తన వాదనలు కొనసాగిస్తూ, ముందుగా ఈ స్కామ్ జిఎస్టీ గుర్తించిందని, ఆ తర్వాతే సిఐడి కేసు నమోదు చేసిందని పేర్కొన్నారు. ఈ కేసులో జివో ఒకరకంగాను, ఒప్పందం మరో రకంగా ఉందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఇరువర్గాల వాదన విన్నధర్మాసనం ఈ కేసు విచారణను మరో బెంచ్ కు బదిలీ చేస్తూ, విచారణను అక్టోబర్ మూడో తేదికి వాయిదా వేసింది.
బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. అక్టోబర్ 4న రెండు పిటిషన్లపై ఒకేసారి వాదనలు వింటామని ఏసీబీ కోర్టు తెలిపింది.. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు పిటి వారంట్ పై వాదనలు ఈ నెల 29వ తేది మధ్యాహ్నం విననున్నారు.