ఇకపై విద్యార్ధుల సిలబస్ పుస్తకాల్లో ఇండియా పేరు స్థానంలో ఇకపై భారత్‌గా పిలవాలనే ఎన్సీఈఆర్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల జీ 20 సమావేశాల్లో వివిధ దేశాధినేతలకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాకుండా.. ప్రెసిడెంట్ ఆఫ్ భారత్‌గా కేంద్రం ఆహ్వానం పత్రాలు పంపినపుడే కేంద్ర ప్రభుత్వం మన దేశం పేరును ఇకపై భారత్‌గా పిలవానే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
ఇక మన భారత రాజ్యాంగంలో ఇండియా దట్ ఈజ్ భారత్ అని ఉంటుంది. దీనిపై మనం ఇంగ్లీష్‌లో రాసినపుడు ఇండియా అని, మాములుగా అయితే భారత్ అనే ఉంటుంది. ఇక మన దేశాన్ని భారత్‌గా పిలవడానికి రాజ్యాంగ సవరణ అవసరం లేదనేది రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు.
ఇకపై కేంద్ర ప్రభుత్వం కూడా ఇంగ్లీష్‌లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బదులు, గవర్నమెంట్ ఆఫ్ భారత్‌గా కంటిన్యూ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమలో ఎన్సీఈఆర్టీ విద్యార్థుల పాఠ్య పుస్తకాల్లో ఇకపై ఇండియాకు బదులు భారత్‌ను కొనసాగించేలా తీర్మానం చేయడం గమనార్హం.
మన స్కూల్ ఎడ్యుకేషన్ సిలబస్‌లోని భారతీయ చరిత్ర ప్రస్థానంలో భారత రాజులు, రాజ్యాల ప్రాధాన్యం తగ్గిందనే వాదన ఎప్పటి నుంచో ఉంది. మనపై దండయాత్రలు చేసిన రాజులు, రాజ్యాలకు చరిత్రలో పెద్దపీట వేశారని చాలామంది భావిస్తున్నారు. ఈ క్రమంలో నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
12వ తరగతి చరిత్ర సిలబస్‌లో కొన్ని మార్పులు, చేర్పులు చేసింది. ఇందులో భాగంగా మొఘలులకు సంబంధించిన పాఠ్యాంశాన్ని పూర్తిగా తొలగించింది. దీంతో పాటు 10, 11తరగతులకు చెందిన వివిధ సబ్జెక్టుల్లోనూ కొన్ని టాపిక్‌లను సవరించింది. ఫలితంగా ఎన్సీఈఆర్టీ సిలబస్‌ని ఫాలో అయ్యే బోర్డులు పాఠ్యాంశాల్లో మార్పులు చేయాల్సి ఉంటుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సి బి ఎస్ ఇ), ఇతర ఎడ్యుకేషన్ బోర్డులు ఎన్సీఈఆర్టీ సిలబస్ అనుసరిస్తున్నాయి.
12వ తరగతికి చెందిన ‘థీమ్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ- పార్ట్2’ పుస్తకంలో నుంచి ‘కింగ్స్ అండ్ క్రానికల్స్; ద మొఘల్ కోర్ట్స్’ చాప్టర్‌ను ఎన్సీఈఆర్టీ పూర్తిగా తొలగించింది. మొఘలుల రాజ్య స్థాపన, పాలనా విధానం, ఆధునిక భారత దేశ చరిత్రలో మొఘలుల పాత్ర గురించి ఈ చాప్టర్ వివరిస్తుంది. 2023-24 అకాడమిక్ ఇయర్ నుంచి ఈ సవరణలను అమలు చేయనున్నారు.
ఫలితంగా హిస్టరీ సిలబస్‌లో మొఘలల చాప్టర్‌కి పూర్తిగా తీసివేసిన్నట్లే. 12వ తరగతితో పాటు 11వ తరగతికి చెందిన చరిత్ర పాంఠ్యాంశాలను కూడా ఎన్సీఈఆర్టీ సవరించింది. ‘థీమ్స్ ఇన్ వరల్డ్ హిస్టరీ’లోని ‘సెంట్రల్ ఇస్లామిక్ ల్యాండ్స్’, ‘కన్‌ఫ్రంటేషన్ ఆఫ్ కల్చర్స్’, ‘ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్’ చాప్టర్లను తొలగించింది.