మిజోరంలో మంగళవారం అసెంబ్లీ ఎన్నికలలో దాదాపు 77.04 శాతం పోలింగ్ నమోదైంది. కాగా ఛత్తీస్‌గఢ్‌లో 70.87 శాతం పోలింగ్ రికార్డు అయినట్లు అధికారులు తెలిపారు. మిజోరంలో సింగిల్ ఫేజ్ పోలింగ్ జరిగింది. కాగా నక్సల్స్ దాడుల భయాలు ఉన్న మిజోరంలో మంగళవారం తొలివిడత పోలింగ్‌కు తక్కువ సంఖ్యలోనే జనం హాజరయ్యారు.
మిజోరంలో 8.57 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఉదయం ఏడు గంటలకు ఓట్ల ప్రక్రియ ఆరంభం అయింది. ఇది సాయంత్రం నాలుగు గంటల వరకూ సాగింది. పోలింగ్‌లో తొలి ఎనిమిది గంటల సమయంలో 69శాతానికి పైగా ఓటింగ్ జరిగింది. మొత్తం 11 జిల్లాల్లోనూ అత్యధిక ఓటింగ్ సెర్చిప్ జిల్లాలో అత్యధికంగా 77.78 శాతం, తరువాతి క్రమంలో ఖవాజాల్‌లో 77 శాతం, హనహతియల్‌లో 74 శాతం, ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.
కాగా అతి తక్కువ పోలింగ్ సియాహ జిల్లాలో రికార్డు అయింది. అక్కడ 52 శాతానికి పైగా జనం ఓటేశారు. ప్రధానమైన ఐజ్వాల్ జిల్లాలో 65 శాతానికి పైగా పోలింగ్ నమోదు అయింది. పోలింగ్ మొత్తం మీద ప్రశాంతంగా సాగిందని, శాంతిభద్రతల పరిస్థితి సవ్యంగా ఉందని మిజోరం అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసరు హెచ్ లియాన్జెలా తెలిపారు.
అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్), ప్రధాన ప్రతిపక్షం జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ (జడ్‌పిఎం) , కాంగ్రెస్ పార్టీలు మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను రంగంలోకి దింపారు. ఈ విధంగా ఇక్కడ త్రిముఖ పోటీ ఉంది. బిజెపి 23 స్థానాలలో పోటీకి దిగింది. ఆప్ నాలుగు స్థానాలకు పోటీ చేస్తోంది. 27 మంది ఇండిపెండెంట్లు బరిలో నిలిచారు.
ఇప్పుడు పోలింగ్ జరిగిన స్థానాలకు డిసెంబర్ 3న కౌంటింగ్, అదే రోజు ఫలితాల వెల్లడి జరుగుతుంది. ముఖ్యమంత్రి జోరాంథంగా ఉదయం ఐజ్వాల్‌లోని పోలింగ్ కేంద్రానికి ఆయన ఓటేయడానికి వెళ్లారు. అయితే సాంకేతిక కారణాలతో ఇవిఎంలు పనిచేయలేదు. దీనితో ఆయన తిరిగి పది గంటలకు ఓటేయడానికి వెళ్లాల్సి వచ్చింది.
ఐజ్వాల్‌లోనే ఉన్న వెస్ట్ 3 నియోజకవర్గానికి వెళ్లి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు లాలసవాతా ఓటేశారు. మొత్తం 1276 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో 149 వరకూ మారుమూల ప్రాంతాలలో ఉన్నాయి. 30 వరకూ అంతరాష్ట్ర, అంతర్జాతీయ సరిహద్దులలో ఉండటంతో ఇక్కడ ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.
మిజోరంకు 510 కిలోమీటర్ల పొడవైన అంతర్జాతీయ సరిహద్దు మయన్మార్ వెంబడి ఉంది. 318 కిలోమీటర్ల మేర బంగ్లాదేశ్‌ను ఆనుకుని ఉంది. పోలింగ్ నేపథ్యంలో ఈ రెండు సరిహద్దులను మూసేశారు. మిజోరంలో 40 స్థానాలలో ఎంఎన్ఎఫ్ 26 స్థానాలను గెల్చుకుంది. ప్రతిపక్ష జడ్ఎన్ఎం ఎనిమిది స్థానాలను దక్కించుకుంది.
కాంగ్రెస్‌కు ఐదు, బిజెపికి ఒక్కసీటు వచ్చాయి. కాగా నాగాలాండ్‌లోని తాపి అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా మంగళవారం ఉప ఎన్నిక జరిగింది. ఇందులో దాదాపు 93 శాతం పోలింగ్ జరిగింది. మావోయిస్టుల ఉద్రిక్తతల ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం జరిగిన తొలివిడత ఎన్నికలలో 70.87 శాతం పోలింగ్ జరిగింది. సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగిసిన తరువాత ఎన్నికల అధికారులు ఈ విషయం తెలిపారు. సుక్మా జిల్లాలో ఐఇడి పేలుడు ఘటన జరిగింది.
కాగా కంకెర్ జిల్లా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు , భద్రతా బలగాల మధ్య భీకర కాల్పులు జరిగాయి.ఈ దశలోనే రాష్ట్రంలో తొలివిడత పోలింగ్‌కు జనం తరలివచ్చారు . రాష్ట్రంలో తొలివిడత పోలింగ్‌లో 20 స్థానాలలో జనం ఓటు హక్కువాడుకున్నారు.