అంతర్జాతీయ వజ్రాలు, అభరణాల వ్యాపారానికి ప్రపంచంలోనే అతి పెద్ద కేంద్రంగా సూరత్‌లోని రూ 3,500 కోట్ల వ్యయంతో నిర్మించిన డైమండ్ బోర్స్ ను ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇదో అత్యంత ఆధునిక నిర్మాణం. 36 ఎకరాల విస్తీర్ణంలో 45 అంతస్తుల్లో దీన్ని నిర్మించారు.
ఒకేసారి 67వేల మంది సౌకర్యవంతంగా కార్యకలాపాలు చేసుకునేలా ఈ భవన నిర్మాణం జరిగింది. 4500పైగా వివిధ కార్యాలయాలున్న ఈ భవనంలో 131 హైస్పీడ్ లిఫ్ట్‌లు ఉన్నాయ్. అంతేకాదు, ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్‌కనెక్టెడ్ భవనంగా రికార్డ్ సృష్టించింది.
డైమండ్ బోర్స్ సెంటర్‌తో వజ్రాల పరిశ్రమకు మరింత ఊపు వస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. గత 80 ఏళ్లుగా ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనంగా ఉన్న అమెరికా పెంటగాన్‌ను సూరత్ డైమండ్ బోర్స్ అధిగమించిందని చెప్పారు. సూరత్ డైమండ్ బోర్స్ భవనం ప్రపంచంలోని అతిపెద్ద కార్యాలయ సముదాయంగా నిర్మించబడింది.
దీనిని దాదాపు 67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో సూరత్ నగరానికి సమీపంలోని ఖాజోద్ గ్రామంలో అన్ని సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది ముడి, పాలిష్డ్ వజ్రాలతో పాటు జ్యూవెలరీకి కూడా ప్రపంచ ట్రేడింగ్ కేంద్రంగా ఉంటుందని తెలుస్తోంది.
దీని ద్వారా దాదాపు 1.5 లక్షల మందికి కొత్త ఉపాధి అవకాశాలు దొరుకుతాయని అంచనా వేయబడింది.ఇది స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ‘కస్టమ్స్ క్లియరెన్స్ హౌస్’ దిగుమతి, ఎగుమతి కోసం, రిటైల్ జ్యువెలరీ వ్యాపారం కోసం ఆభరణాల మాల్.
పైగా ఇక్కడ అంతర్జాతీయ బ్యాంకింగ్, సురక్షితమైన వాల్ట్ సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురాబడ్డాయి. గతంలో ముంబైలో ఉన్న వారితో సహా పలువురు వజ్రాల వ్యాపారులు ఇప్పటికే తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే వేలం తర్వాత వ్యాపారులకు యాజమాన్యం కేటాయించింది.
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ ఫిబ్రవరి 2015లో దీనికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. తాజా మహా నిర్మాణం సైతం డ్రీమ్ సిటీలో భాగంగా ఉంది. ఇక్కడ ప్రస్తుతం దాదాపు 4,500 డైమండ్ ట్రేడింగ్ ఆఫీసులు ఉండటంతో ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనంగా అవతరించింది. డ్రీమ్ సిటీ లోపల 35.54 ఎకరాల ప్లాట్‌లో నిర్మించిన ఈ మెగా నిర్మాణంలో 15 అంతస్తుల తొమ్మిది టవర్లు 300 చదరపు అడుగుల నుంచి లక్ష చదరపు అడుగుల వరకు కార్యాలయ స్థలాలు ఉన్నాయి.