2024 లోక్ సభ ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్న కాంగ్రెస్ నాయకత్వం పార్టీ ప్రధాన కార్యదర్శుల బాధ్యతలలో కీలక మార్పులు చేసింది. రాస్త్రాలకు ఇన్ ఛార్జ్ లను మార్చివేసింది. పశ్చిమ బెంగాల్ సీనియర్ నేత దీపాదాస్ మున్షీని తెలంగాణకు నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేరళ, లక్షద్వీప్ ల ఇన్ ఛార్జ్ గా నియమించడంతో పాటు తెలంగాణకు అదనపు బాధ్యతలు అప్పచెప్పారు.
ఇప్పటి వరకు తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా పనిచేసిన థాక్రేను… గోవా కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా మాణిక్కం ఠాగూర్ పేరును ఖరారు చేసింది. తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జ్‌గా నియమితులైన దీపాదాస్ మున్షీ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకురాలిగా పనిచేశారు.
అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు మహారాష్ట్ర మాజీ పీసీసీ అధ్యక్షుడు మాణిక్ రావ్ ఠాక్రేను తెలంగాణ ఇన్‌చార్జీగా ఏఐసీసీ నియమించింది. ఠాక్రేకు ముందు ఇన్చార్జిగా పని చేసిన మాణిక్ రావ్ ఠాకూర్.. అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని సీనియర్లు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వచ్చే లోక్ సభ ఎన్నికలకు సీరియస్ గా తీసుకుంటుంది. మెజార్టీ సీట్లలో గెలుపే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఇప్పటికే ఇంఛార్జులను కూడా నియమించింది. 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంఛార్జులను ప్రకటించింది.
ఇలా ఉండగా, ప్రియాంక గాంధీ వాద్రాకు ఇదివరకు ఉన్న ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జీ బాధ్యతల నుంచి తప్పించింది. ఏపీ సహా పలు రాష్ట్రాలకు ఇన్ఛార్జీలను అపాయింట్ చేసింది. ముకుల్ వాస్నిక్- గుజరాత్, జితేంద్రసింగ్- అస్సాం, మధ్యప్రదేశ్ (అదనపు ఇన్ఛార్జ్) బాధ్యతలను అప్పగించింది. రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా- కర్ణాటక, దీపక్ బబారియా- ఢిల్లీ, హర్యానా (అదనపు ఇన్ఛార్జ్), సచిన్ పైలెట్- ఛత్తీస్‌గఢ్.
అవినాష్ పాండే- ఉత్తరప్రదేశ్, జీఏ మిర్- జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ (అదనపు ఇన్ఛార్జ్), దీపా దాస్‌మున్షీ- కేరళ, లక్షద్వీప్, తెలంగాణ (అదనపు ఇన్ఛార్జ్), జైరామ్ రమేష్- కమ్యూనికేషన్స్, కేసీ వేణుగోపాల్- ఆర్గనైజేషన్ నియమించింది. రమేష్ చెన్నితల- మహారాష్ట్ర, మోహన్ ప్రకాష్- బిహార్, డాక్టర్ చెల్లకుమార్- మేఘాలయా, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, డాక్టర్ అజొయ్ కుమార్- ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి (అదనపు ఇన్ఛార్జ్)గా నియమితులయ్యారు.
భరత్సింహ్ సోలంకి- జమ్మూ కాశ్మీర్, రాజీవ్ శుక్లా- హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, దేవేందర్ యాదవ్- పంజాబ్ బాధ్యతలను అప్పగించింది ఏఐసీసీ. మొన్నటివరకు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జీగా వ్యవహరించిన మాణిక్ రావ్ థాకరేను అదే స్థానంలో కొనసాగిస్తూనే గోవా, దామన్, డయ్యు, దాద్రానగర్ హవేలీ బాధ్యతలను కేటాయించింది. దీపా దాస్‌మున్షీ తెలంగాణకు అదనపు ఇన్ఛార్జీగా వ్యవహరిస్తారు.
కీలకమైన ఏపీ ఇన్ఛార్జీ బాధ్యతలను మాణిక్కం ఠాగూర్ చేతిలో పెట్టింది. గతంలో ఆయన తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జీగా వ్యవహరించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఆయన బాధ్యతలను స్వీకరించనున్నారు. ఏపీతో పాటు అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ఛార్జీగా పని చేస్తారాయన. గిరీష్ చోడంకర్‌కు త్రిపుర, సిక్కిం, మణిపూర్, నాగాలాండ్ బాధ్యతలను అప్పగించింది.