అంతర్జాలంలో ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఆయన యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్ల సంఖ్య రెండు కోట్లు దాటింది. మంగళవారం ఈ అరుదైన రికార్డును నెలకొల్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాధినేతలు అత్యధిక సంఖ్యలో మోడీకి యూట్యూబ్ ఖాతాదారులుగా ఉన్నారు.
ప్రభుత్వ యూట్యూబ్ ఛానల్లో ప్రధాని తన వీడియోలను తరచూ పోస్టు చేస్తుంటారు. ఆ వీడియోలను సుమారు 450 కోట్ల మంది ఇప్పటికే వీక్షించారు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా నరేంద్ర మోదీ రెండు కోట్ల మంది సబ్ స్క్రైబర్ లను పొంది ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి నేతగా చరిత్రలో నిలిచారు.
నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానల్ వ్యూస్ సబ్స్క్రైబర్ల విషయంలో భారతీయ భౌగోళిక సమకాలీన నేతలందరినీ అధిగమించి అత్యధికంగా సబ్స్క్రైబర్లు ఉన్న చానల్ గా ఘనత సాధించింది. వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రయిబర్ల సంఖ్య రెండు కోట్లకు చేరుకున్న తొలి ప్రపంచ నాయకుడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనత సాధించడం ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది.
తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలు, లైవ్ కార్యక్రమాలను ప్రధాన నరేంద్ర మోదీ పోస్ట్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాల్లో మోదీ చానల్ కు అత్యధిక స్థాయిలో సబ్స్క్రైబర్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. నరేంద్ర మోదీ తన యూట్యూబ్ ఛానల్ 2007లో క్రియేట్ చేశారు. ఆయన గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలోనే ఈ యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించారు.
2019లో కాశీ పర్యటన సమయంలో దివ్యాంగులు ఆయనకు వెల్కం చెప్పిన వీడియోను మోడీ షేర్ చేయగా, ఆ వీడియోను ఎక్కువ మంది వీక్షించారు. ఆపై నాటి ఇస్రో చైర్మన్ కేశివన్ భావోద్వేగానికి లోనైన వీడియోని మోడీ పోస్ట్ చెయ్యగా అది కూడా బాగా ట్రెండ్ అయ్యింది.
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తో తన ఇంటర్వ్యూ కూడా ప్రధాని మోదీ యూట్యూబ్ ఛానల్ కు ఎక్కువ మంది వీక్షకులను తెచ్చిపెట్టింది. అంతేకాకుండా దేశానికి సంబంధించిన, ప్రధాని మోదీ చెప్పాలనుకున్న ఏ విషయాన్నైనా యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్పడంతో, విలువైన సమాచారం ప్రధాని మోడీ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందుతున్న క్రమంలో ప్రతి ఒక్కరు ఆయన యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు .