పోలీసు శాఖతో పాటు రాజకీయపరంగా కలకలం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తు వేగవం తం చేశారు. ప్రణీత్ రావు ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త అంశం బహిర్గతమవుతోంది. ఎస్ఐబి కార్యాలయంతో పాటు ఇతర ప్రైవేటు ప్రదేశాల్లోనూ ఫోన్ ట్యాపింగ్ చేశారని ప్రధాన ఆరోపణలు వినిపిస్తుండగా, పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
మాజీ టాస్క్‌ఫోర్స్ డిసిపి రాధాకిషన్‌రావు, సిఐ గట్టు మ ల్లును పోలీసులు విచారించారు. ట్యాపింగ్ వ్యవహారంలో మూలాలు కీలక ఫైల్స్ లభ్యమైనట్లు సమాచారం. ఓ మాజీమంత్రి తరచూ ఆయన ఇంటికి వచ్చి వెళ్తుండేవారని స్థానికులు పోలీసులకు వివరించారు. అరెస్టయిన అధికారుల ఆస్తులు, ఆదాయాలపై దృష్టి సారించింది.
ముఖ్యంగా ప్రణీత్‌రావుకు మూసాపేటలోని నివాసంతోపాటు నగరంలో మరో చోట కోట్ల విలువైన విలాసవం తమైన గృహం ఉన్నట్లు అధికారులు అనుమనాలు వ్యక్తం చేస్తున్నారు. ట్యాపింగ్ కోసం వినియోగించిన సామగ్రిని విదేశాల నుంచి కొనుగోలు చేశారని తేలడంతో, ఇందుకు సహకరించిన వారిపైనా పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఆ పరికరాలని ఎక్కడ పెట్టారు? ఇతర ప్రైవేటు ప్రదేశాలలో ఏర్పాటు చేసి ట్యాపింగ్ చేశారా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ట్యాపింగ్ చేయాలని ఆదేశించిన రాజకీయ పెద్దలకు సైతం నోటీసులు ఇచ్చి విచారించేందుకు న్యాయ సలహా కోరతున్నట్లు సమాచారం.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న ప్రణీత్‌రావు, బృందంలో కీలకంగా ఉండి ప్రస్తుతం వరంగల్ జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు, గతేడాది అసెంబ్లీ ఎన్నికల వేళ నల్గొండ జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు, రియల్టర్లు, వ్యాపారుల ఫోన్‌కాల్స్ ట్యాపింగ్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలను ఒక యూనిట్‌గా చేసి ఈ రెండు జిల్లాల వార్ రూమ్‌ను నల్గొండలోని ఓ భవనంలో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. గతంలో నల్గొండ జిల్లాలో పనిచేసి ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారే ఇంఛార్జ్‌గా వ్యవహరించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.
ప్రస్తుతం కీలక పదవిలో ఉన్న ప్రజా ప్రతినిధితోపాటు సదరు ప్రజాప్రతినిధికి అండగా ఉన్న ఉమ్మడి జిల్లాలోని పలువురు నేతల ఫోన్‌కాల్స్ లక్ష్యంగా ఈ వార్ రూమ్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇజ్రాయెల్‌కు చెందిన అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి అమెరికాకు చెందిన నలుగురు సాఫ్ట్వేర్ టెకీలు నల్గొండ వార్‌రూంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపినట్లు తెలిసింది.
ఎవరెవరి ఫోన్లను ట్యాపింగ్ చేశారు? బెదిరించిన రియల్టర్లు, వ్యాపారులు ఎవరు, వారి నుంచి ఎంత మొత్తంలో డబ్బులు వసూళ్లు చేశారనే దానిపై సమగ్ర దర్యాప్తు జరపడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. మును గోడు ఉపఎన్నికల్లోనూ పలువురు నేతలు, వ్యాపారుల ఫోన్‌కాల్స్‌ను ట్యాప్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు దర్యాప్తులో బయటపడగా బాధి తులు ఎవరైనా ఫిర్యాదు చేయడానికి వస్తే వాటి ఆధారంగా కేసులు నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నారు.