“పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిన వెంటనే” జమ్మూ కాశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదా లభిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం తెలిపారు, డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు.
అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు జిల్లా స్థాయిలో పరిపాలన యొక్క ఒకే విధమైన బెంచ్‌మార్కింగ్ కోసం రోడ్‌మ్యాప్‌ను అందించే భారతదేశపు మొట్టమొదటి “జిల్లా మంచి పాలన సూచిక”ను విడుదల చేసిన వర్చువల్ ఈవెంట్లో అమిత్ షా మాట్లాడుతూ, “ప్రజాస్వామ్య ప్రక్రియకు సంబంధించినంతవరకు, డీలిమిటేషన్ మొదలైంది. ఆ తర్వాత ఎన్నికలు జరగనున్నాయి. వారు (రాజకీయ పార్టీలు) ఏమి చెప్పినా, జమ్మూ కాశ్మీర్ కు పూర్తి రాష్ట్ర హోదా వస్తుంది” అని భరోసా ఇచ్చారు.
“నేను పార్లమెంటులో ఈ హామీని ఇచ్చాను – జైసే హై స్థితి సామాన్య హో జాయేగీ, జమ్మూ కాశ్మీర్ కో పూర్ణ రాజ్య కా దర్జా మిలేగా (పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిన వెంటనే, జమ్మూ కాశ్మీర్ పూర్తి రాష్ట్ర హోదాను పొందుతుంది)” అని ఆయన పేర్కొన్నారు.
“87 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎంపీలు, మూడు కుటుంబాలు పాలనలో పాలుపంచుకున్న కాశ్మీర్లో ఇప్పుడు గ్రామం నుండి కేంద్ర పాలిత ప్రాంతం స్థాయి వరకు 30,000 మందికి పైగా ప్రజాప్రతినిధులు ఉన్నారు” అని అమిత్ షా ఈ సందర్భంగా గుర్తు చేశారు. వారు జమ్మూ కాశ్మీర్ లో అభివృద్ధిని నిర్ధారిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
కేంద్ర పాలిత ప్రాంతంలో పంచాయతీరాజ్ వ్యవస్థను అమలు చేయడం వల్ల జమ్మూ కాశ్మీర్‌లోని కొన్ని రాజకీయ పార్టీలు బాధపడ్డాయని పేర్కొంటూ ఆర్టికల్ 370 ప్రకారం పూర్వ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను రద్దు చేయడం వల్ల శాంతిభద్రతలు క్షీణించాయను చేస్తున్న వాదనలను ఆయన ప్రశ్నించారు.
“కొందరు ఆర్టికల్ 370 ఉనికిలో లేకుంటే, శాంతిభద్రతల పరిస్థితిని పరిష్కరించలేమని కూడా వాదించారు,” అని ఆయన గుర్తు చేశారు. ఏప్రిల్ 2017 నుండి 2019 వరకు, 2019 నుండి 2021 వరకు తులనాత్మక అధ్యయనంలో “ఉగ్రవాద సంఘటనలలో 40 శాతం క్షీణత, 57 శాతం మరణాలు” ఉన్నాయని హోం మంత్రి తెలిపారు.
116 డేటా అంశాలతో 10 సెక్టార్ల గవర్నెన్స్, 58 ఇండెక్స్‌లను కవర్ చేసే జమ్మూ కాశ్మీర్ జిల్లాల గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్‌ను ప్రారంభించిన సందర్భంగా, అమిత్ షా “ఈ రోజు జమ్మూ కాశ్మీర్ కు మాత్రమే కాకుండా దేశం మొత్తానికి ముఖ్యమైన రోజు” అని చెప్పారు. ఇక్కడ చేపట్టిన నూతన ప్రారంతం దేశంలో ప్రతి రాష్ట్రానికి చేరుకుంటుందని, దేశంలోని ప్రతి జిల్లాలో సుపరిపాలన యొక్క ఆరోగ్యకరమైన పోటీకి దారి తీస్తుందని ఆయన భరోసా వ్యక్తం చేశారు.