ప్రఖ్యాతిగాంచిన వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం తన 45 గంటల ధ్యానాన్ని ప్రారంభించారు. సమీపంలోని తిరువనంతపురం నుంచి హెలికాప్టర్లో కన్యాకుమారి చేరుకున్న ప్రధాని మొదుగా భగవతి అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు.
ఫెర్రీలో రాక్ మెమోరియల్ చేరుకున్న మోదీ ధ్యానం ప్రారంభించారు. జూన్ 1వ తేదీ వరకు ధ్యానం సాగుతుంది. తెల్లని ధోవతి, శాలువా ధరించిన మోడీ భగవతి అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అనంతరం అమ్మవారిని గర్భాలయంలో దర్శించుకున్నారు. ఆలయ ఆర్చకులు అమ్మవారికి ఈ సందర్భంగా ప్రత్యేక హరతి ఇచ్చి ప్రధాని మోదీకి ప్రసాదంగా శౠలువాతోపాటు అమ్మవారి చిత్రపటాన్ని అందచేశారు.
అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన షిప్పింగ్ కార్పొరేషన్ నిర్వహించే ఫెర్రీ సర్వీసులో వివేకానంద రాక్ మెమోరియల్ చేరుకున్నారు. ధ్యానంలోకి వెళ్లడానికి ముందు మోడీ కొద్ది సేపు ధ్యాన మండపానికి దారితీసే మెట్ల పైన కూర్చుని అద్భుతంగా కనిపించే సముద్ర అందాలను వీక్షించారు. జూన్ 1న ధ్యానం ముగించిన అనంతరం ఇక్కడ నుంచి బయల్దేరి వెళ్లడానికి ముందు ప్రధాని కన్యాకుమారిలోని తిరువల్లువర్ విగ్రహాన్ని దర్శించనున్నారు.