యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోమొదటి మూడు దశ చవిచూస్తోందన్నపోలింగ్ లో గట్టి పోటీ ఎదురైనట్లు స్పష్టం కావడం, సమాజవాద్ పార్టీ బాగా కోలుకున్నట్లు వెల్లడి కావడంతో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు దిద్దుబాటు చర్యలకు దిగిన్నట్లు తెలుస్తున్నది.
యుపి ఎన్నికలను 2024లో జరుగబోయే లోక్ సభ ఎన్నికలకు రిహార్సల్ గా భావిస్తూ ఉండడంతో రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడవలసిందే అని భావిస్తున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నేతలు రంగంలోకి దిగి బిజెపి ప్రచారాన్ని ఫలప్రదం చేసేందుకు కార్యాచరణకు పూనుకున్నట్లు చెబుతున్నారు.
ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో హిందువులు ఉత్సాహంగా ఓట్ వేయడం లేదని తెలియడంతో ప్రజలను సమీకరించేందుకు కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి సహాయాన్ని కోరినట్లు తెలిసింది. అయితే ఆమె అందుకు విముఖత వ్యక్తం చేసిన్నట్లు చెబుతున్నారు. 2012 యుపి ఎన్నికలలో ఆమె బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి కావడం గమనార్హం.
ఆర్ఎస్ఎస్ సహా సర్ కార్యవాహ అరుణ్ కుమార్ నాల్గవ దశకు ముందు జలౌన్ (యుపి)లో భారతిని కలుసుకుని బిజెపికి ప్రచారం చేయమని కోరగా, ఆమె అంగీకరించలేదని చెబుతున్నారు. బిజెపి నాయకత్వం తన పట్ల అవమానకరంగా వ్యవహరించడాన్ని ఆమె మరచిపోలేక పోతున్నారు. అయితే ఆమె అనారోగ్యం కారణంగా చూపి ప్రచారంకు దూరంగా ఉంటున్నారు.
నాలుగో దశ పోలింగ్ జరిగిన బుందేల్ఖండ్ , అవధ్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో చెల్లాచెదురుగా ఉన్న లోధ్ కమ్యూనిటీకి చెందిన ఆమె మద్దతుదారులలో పాటు హిందుత్వ మద్దతుదారులలో ఆమె పట్ల పార్టీ వ్యవహరించిన తీరు తప్పుడు సంకేతాలను పంపిన్నట్లు ఇప్పుడు గ్రహిస్తున్నారు. అరుణ్ కుమార్ ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ లో బిజెపి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు.
ఆర్ఎస్ఎస్ సూచన మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఇక ఎక్కువగా యుపి ప్రచారం పట్ల కేంద్రీకరింపనున్నారు. మార్చ్ 2 నుండి మూడు రోజుల పాటు వారణాసి కేంద్రంగా ప్రచారం చేయనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే యూపీ ఎన్నికలను బీజేపీ సెమీ ఫైనల్గా చూస్తోంది. అత్యంత కీలకమైన రాష్ట్రాన్ని పార్టీ కోల్పోతే, 2024లో మళ్లీ అధికారంలోకి రావడం కష్టమే’’ అని అంతర్గత వ్యక్తి ఒకరు చెప్పారు.
సంబంధితంగా, ఉమాభారతి ఉత్తరప్రదేశ్లోని హిందువుల జనాభాలో 7 శాతం ఉన్న లోధ్ కమ్యూనిటీ నుండి వచ్చింది. సాంప్రదాయకంగా, లోధ్ కమ్యూనిటీ బిజెపికి ఓటువేస్తూ వచ్చింది. అయితే ఈసారి యోగి ప్రభుత్వంలో తమకు తగు ప్రాతినిధ్యం లభింపలేదని గణనీయ సంఖ్యలో సమాజ్ వాదీ పార్టీ నేతృత్వంలోని కూటమికి మారవచ్చని చాలా మంది నమ్ముతున్నారు.
ఫైర్ బ్రాండ్ హిందుత్వ నాయకురాలు, 1992లో బాబ్రీ మసీదు కూల్చివేతతో ముగిసిన అయోధ్య ఉద్యమంలో మహిళా ముఖం, భారతి మధ్యప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతంలో కూడా ఆమెకు పలుకుబడి ఉంది. సాధ్వి అని పిలువబడే కాషాయ వస్త్రధారణ భారతి, 2003లో మధ్యప్రదేశ్లో 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు ముగింపు పలికి బిజెపిని అధికారంలోకి తీసుకు రావడంలో కీలక పాత్ర వహించారు.
అయితే ఆమెకు ముఖ్యమంత్రి పదవి మూన్నాళ్ళ ముచ్చటగా మిగిలింది. ఆ తర్వాత ఆమెను రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. దానితో పార్టీ నుండి వైదొలిగి తన సొంత పార్టీని కూడా ఏర్పాటు చేసుకున్నారు.
మోదీ మంత్రివర్గంలో జల వనరులతో పాటు గంగానది ప్రక్షాళన మంత్రిత్వ శాఖలను ఆమెకు కేటాయించినా, ఆమె చేసిన అనేక ప్రతిపాదనలు కార్యరూపం దాల్చక పోవడం,ఆమెకు ఎంతో ఇష్టమైన గంగానది ప్రక్షాళణ శాఖను ఆమె నుండి తీసుకోవడంతో ఆమె తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.
ఇప్పుడు ఉమాభారతి వంటి పాత నేతలను ఎన్నికల ప్రచారంలో దించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ప్రచారంకు దూరంగా ఉన్న మరో అయోధ్య ఉద్యమ ప్రముఖుడు, ఓబిసి నేత వినయ్ కతియార్ తో పాటు వివిధ కులాల పెద్దలు, సాధువులు, అక్షరాలు, మత సంఘాలను కూడా ప్రచారంలోకి దింపేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
ముఖ్యంగా గోహత్య పేరుతో అనేకమందిపై కేసులు నమోదు చేస్తుండడంతో గోవులు విచ్చలవిడిగా తిరుగుతూ పంటలకు నష్టం కలిగిస్తున్నట్లు రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై రైతులకు నచ్చచెప్పేందుకు బిజెపి నేతలు ప్రయత్నం ప్రారంభించారు. అందుకనే గోవుల పెంపకం ఇబ్బంది అయినవారికి గోవుకు రూ 1,000 చొప్పున ఇస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.
ప్రధాని మోదీ మూడు రోజుల పాటు వారణాసిలో బస చేసి ఉత్తరప్రదేశ్లో ఆరు, ఏడవ దశ పోలింగ్ జరిగే స్థానాలపై దృష్టి సారింపనున్నారు. కీలకమైన తూర్పు ఉత్తరప్రదేశ్లోని మొత్తం 111 స్థానాలకు చివరి రెండు దశల్లో పోలింగ్ జరగనుంది.