నేడు 115వ జయంతి సందర్భంగా నివాళులు
జనరల్ కోడెండెర సుబ్బయ్య తిమ్మయ్య (1906-1965), భారత సైన్యంలోని సైనిక దిగ్గజం. 1962లో చైనాతో వివాదానికి దారితీసిన కీలక సంవత్సరాల్లో 1957 నుండి 1961 వరకు ఆర్మీ స్టాఫ్ చీఫ్‌గా పనిచేశారు. ఈరోజు 115 సంవత్సరాల క్రితం ఆయన జన్మించారు.
రెండవ ప్రపంచ యుద్ధంలో యుద్ధంలో పదాతిదళ దళానికి నాయకత్వం వహించిన ఏకైక భారతీయుడు తిమ్మయ్య. భారత సైన్యం సృష్టించిన అత్యంత విశిష్ట పోరాట అధికారిగా ఆయనను పరిగణిస్తారు. కొరియా యుద్ధం తరువాత, యుద్ధ ఖైదీలను స్వదేశానికి రప్పించే ఐక్యరాజ్యసమితి విభాగానికి నాయకత్వం వహించారు.
ఆయన సైన్యం నుండి పదవీ విరమణ చేసిన తర్వాత, జూలై 1964 నుండి డిసెంబర్ 1965 వరకు సైర్పస్లో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళానికి కమాండర్‌గా పనిచేశారు. 18 డిసెంబర్ 1965న విధినిర్వహణలో ఉండగానే సైప్రస్‌లో మరణించారు.
ఆయన అన్నయ్య పొనప్ప నేతాజీ ఏర్పాటు చేసిన ఐఎన్ఎ లో పనిచేశారు. తమ్ముడు సోమయ్య కాశ్మీర్లో సైనిక చర్యలో చనిపోయారు. జాత్యహంకార బ్రిటీష్ సైనిక అధికారులతో ఇమడలేక, సైన్యం నుండి తప్పుకొని స్వతంత్ర ఉద్యమంలో చేరాలనుకున్నారు. అయితే మోతీలాల్ నెహ్రూ దానినిఆయనను ఆ సమయంలో వారించారు.
క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా ఆందోళనకారులపై కాల్పులు జరపవద్దని సైనికులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయన రంగూన్లో ఐఎన్ఐ లొంగిపోవడాన్ని పర్యవేక్షించారు. ఆయన సోదరుడు యుద్దఖైదీలలో ఒకరు కావడం గమనార్హం. ఆ తర్వాత యుద్ధఖాదీలను స్వదేశానికి రప్పించి, అతను జనరల్ డగ్లస్ మెక్ ఆర్థర్ ప్రశంసలు పొందారు.
1947లో మొదటి కాశ్మీర్ యుద్ధంలో, జోజి లా పాస్‌ను స్వాధీనం చేసుకోవడానికి వ్యక్తిగతంగా ట్యాంక్‌లో ముందు నుండి నడిపించారు. కాశ్మీర్‌లోని రైడర్లను తిప్పికొట్టడానికి ఆయన నెహ్రూను కేవలం 3 నెలల సమయం అడిగారు. అయితే నెహ్రు అందుకు తిరస్కరించి, కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితికి నివేదించారు.
నెహ్రూ, వీకే మీనన్‌తో వైరం
పండిట్ నెహ్రూ, జనరల్ తిమ్మయ్య మధ్య చాలాకాలం వైరం కొనసాగినదనే ప్రచారం ఉంది. అయితే కొందరు వారి మధ్య సత్సంబంధాలు నెలకొన్నాయని చెప్పవారు. అయినప్పటికీ, తిమ్మయ్య రాజీనామా చేయడం నెహ్రు కారణంగా జరిగినదని చాలా మంది నమ్ముతారు. సెప్టెంబరు 1959లో, జనరల్ తిమ్మయ్య తన రాజీనామాను అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు పంపారు. కానీ, వెంటనే దాన్నిఆయన వత్తిడిపై ఉపసంహరించుకున్నారు.
నాటి రక్షణ మంత్రి వీకే కృష్ణ మీనన్ పనితీరు పట్ల అసంతృప్తితో రాజీనామాకు ప్రేరేపించారని భావిస్తున్నారు. సీనియర్ అధికారుల పదోన్నతిపై వారిద్దరికీ విభేదాలు వచ్చాయి. ఏది ఏమైనప్పటికీ, శివ కుమార్ వర్మ పుస్తకం మరో వాదనను చేస్తుంది. ఆర్మీ చీఫ్‌ను అప్రతిష్టపాలు చేయడానికి నెహ్రూ, మీనన్‌ల కుట్రపూరితంగా వ్యవహరించారని ఆయన వ్రాసారు.
1962 నాటి ఇండో-చైనా వివాదం సమయంలో భారతదేశం ఘోరమైన ఓటమికి దారితీసిన ఇతర సంఘటనలకు సంబంధించి ఆ పుస్తకంలో పేర్కొన్న ఒక సారాంశం:
“నెహ్రూ తిమ్మయ్య కోసం ఎదురు చూస్తున్నారు. మొదటిసారిగా, సాధారణంగా నిరాడంబరమైన టిమ్మి ప్రధానమంత్రితో కోపంగా పదాలు ప్రయోగించారు. పార్లమెంటులో బహిరంగపరచిన నీఫా [నార్త్-ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ] సైన్యానికి బాధ్యత వహించాలనే ప్రధాని ఏకపక్ష నిర్ణయం అవాస్తవమని, భారతీయ ప్రయోజనాలకు పూర్తిగా విరుద్ధమని ఆయన నెహ్రూతో స్పష్టంగా చెప్పారు”.
” నెహ్రూ సైనిక ప్రయోజనాలతో పూర్తిగా రాజీ పడ్డారని తిమ్మయ్య భావించారు. అవసరమైన అదనపు వనరులను అందించకుండా, సరిహద్దులను సైన్యానికి అప్పగించడం అర్థరహిత సంకేతం అని భావించారు. ఇది భారతీయులు దురాక్రమణదారులని చెప్పుకునే అవకాశాన్ని చైనీయులకు కల్పిస్తుంది, ఎందుకంటే వారు తమ సొంత సైన్యాన్ని సరిహద్దు గార్డులుగా వర్ణించడానికి ఎల్లప్పుడూ చాలా కష్టపడతారు”.
“తిమ్మయ్య నెహ్రూను రాబోయే రెండు వారాల్లో గందరగోళం నుండి బయటపడే మార్గాన్ని అడిగారు. ఆ తర్వాత ఆయన బయలుదేరారు. తిమ్మయ్య నిష్క్రమించిన వెంటనే, కదిలిన ప్రధాని కృష్ణ మీనన్‌ను తీన్ మూర్తి వద్దకు పిలిపించారు”.
చైనా నుండి వచ్చే ప్రమాదాలను అందరికన్నా ముందే గుర్తించగల దూరదృష్టిని తిమ్మయ్య ప్రదర్శించారు. దానిని మెచ్చుకోవలసిందిపోయి, నెహ్రూ ఆయనను పార్లమెంటులో ఎగతాళి చేశారు. వెంటనే టిమ్మీ తన కార్యాలయంలో తన రాజీనామాను ప్రధానమంత్రికి సమర్పించారు. దానిని ఉపసంహరించుకోవాలని ఆయనను మళ్లీ నెహ్రు ఒప్పించారు. కానీ ఆ తర్వాత ఆయన అంత క్రియాశీలకంగా పనిచేయలేక పోయారు.
తదుపరి ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ థోరట్ను నియమించాలనే ఆయన ప్రతిపాదనను నెహ్రూ తిరస్కరించారు. బదులుగా సాధారణమైన ప్రాణ్ నాథ్ థాపర్‌ను నియమించారు.
సైప్రస్‌లో చివరి సంవత్సరాలు
తిమ్మయ్య సైప్రస్‌లో అంతర్యుద్ధం సమయంలో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళంలో భాగంగా తన చివరి రోజులను గడిపారు. గుండెపోటు కారణంగా 1965లో సైప్రస్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలకు భారత్ ప్రభుత్వం ముఖ్యమైన వ్యక్తి ఎవరూ హాజరుకాలేదు, విల్సన్ గార్డెన్ స్మశానవాటికలో అంతగా ప్రాముఖ్యత లేని ప్రదేశంలో ఆయనను ఖననం చేశారు.
సైప్రస్ అధ్యక్షుడు భారతదేశానికి వచ్చినప్పుడు, ప్రత్యేకంగా ఆయనను గౌరవించటానికి, మన ప్రభుత్వం, మేల్కొని, బెంగుళూరులోని ఎ ఎస్ సి సెంటర్లో హడావుడిగా ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించింది. సైప్రస్‌లో జనరల్ తిమ్మయ్య మరణించినప్పుడు, సైప్రస్ ప్రభుత్వం 10 రోజుల సంతాప దినాలు ప్రకటించారు వారి జాతీయ పతాకాన్ని సగం దించారు.
“జనరల్ తిమ్మయ్య ఒక తెలివైన వ్యూహకర్త మాత్రమే కాదు. అందరి దృష్టిని మించి ఆయన ఎదుర్కొన్న సవాళ్లు, వాటికి ఆయన చూపిన ప్రతిస్పందన సాటిలేనిది” ”అని ఫీల్డ్ మార్షల్ మానేక్షా, భారత సైన్యంలోని ఉత్తమ జనరల్ ఎవరని మీరు భావిస్తున్నారని అడిగినప్పుడు చెప్పారు.
పద్మభూషణ్ అవార్డు గ్రహీత, జనరల్ తిమ్మయ్య రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బర్మాలోని పదాతిదళ దళానికి నాయకత్వం వహించారు. 1948లో స్వాతంత్య్రానంతర ఘర్షణల సమయంలో పాకిస్తానీ రైడర్లపై ఆకస్మిక దాడిలో కీలక పాత్ర పోషించినందుకు కూడా ప్రసిద్ది చెందారు. తన 35 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్లో, జనరల్ తిమ్మయ్య తన సేవలకు జనరల్ సర్వీస్ మెడల్, ఇండియన్ ఇండిపెండెన్స్ మెడల్‌లతో గుర్తింపు పొందారు.